తెలంగాణా లో దారుణం! క్రైస్తవ దేవాలయం పై దాడి
తెలంగాణా లో దారుణం! క్రైస్తవ దేవాలయం పై దాడి
హైదరాబాద్ లోని గండిపేట దగ్గరలో జనవాడ అనే ప్రాంతంలో మెథడిస్ట్ చర్చి పై ఫిబ్రవరి 13న భూ వివాదంపై హిందువుల గుంపు వారిపై దాడి చేయడంతో కనీసం 20 మంది క్రైస్తవులు గాయపడ్డారని ఇండియాస్ మెథడిస్ట్ అధినేత బిషప్ MA డేనియల్ తెలిపారు . కొందరికి తలలు పగిలి తీవ్రగాయాలు అయ్యాయి వారిని హుటాహుటిన కొండాపూర్ తరలించారు. మరికొందరిని గాంధీ హాస్పిటల్ కి తరలించారు.
క్రైస్తువులకు పవిత్రమైన 40 రోజుల శ్రమదినాల ముందు రోజు ఈ దాడి జరిగింది. గ్రామంలోని మెథడిస్ట్ చర్చి సమీపంలోని పబ్లిక్ రోడ్డు విస్తరణ పనులకు ఈ భూ వివాదం ముడిపడి ఉంది. తమ సమ్మతి లేకుండా చర్చి భూమిని రోడ్డు కోసం కేటాయించే ప్రయత్నాలపై క్రైస్తవులు ఆందోళనకు గురయ్యారని పేరు చెప్పడానికి ఇష్టపడని చర్చి అధికారి తెలిపారు.ఫిబ్రవరి 13 తేదీ రాత్రి 7 గంటల సమయంలో మెథడిస్ట్ దేవాలయంలోనికి సుమారు 150 మందికి పైగా స్థానిక గ్రామస్తులు ప్రవేశించి చిన్న, పెద్ద అని చూడకుండా రాళ్ళూ ,కర్రలతో దాడి చేసారు. చుట్టూ పక్కల వున్నా దళిత ,పేద కుటుంబాల ఇళ్ల పై కూడా దాడి చేసారు.
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు RS ప్రవీణ్ గారు దేవాలయాన్ని సందర్శించి ఈ దాడిని ఖండించారు. 18 మంది గాయపడగా, ముగ్గురికి గురికి తీవ్ర గాయాలు అయ్యాయి అని RS ప్రవీణ్ గారు తెలిపారు. అయన మాట్లాడుతూ " జన్వాడ హైదరాబాద్ మహా నగరానికి దగ్గరలో ఉన్న గ్రామం అని, ఇక్కడే ఇలాంటి దాడులు జరుగుంటే ఇతర ప్రాంతాలలో పరిస్థితి ఏంటి అని అన్నారు. ప్రార్థన చేసుకుంటున్న ఒక వ్యక్తి పోలియో బాధితుడు అని కూడా కనికరం లేకుండా రాడ్ తో తలమీద కొట్టారు అని, 18 కుట్లు పడి చావు బతుకుల మధ్య ఉన్నాడని బాధ పడ్డారు. తెలంగాణా లోని కామారెడ్డి జిల్లా మేనూరులో మరో ఇద్దరు క్రైస్తవుల పై కూడా దాడి చేసిన ఘటన వెలుగులోనికి వచ్చింది. నిన్నటి రోజున జన్వాడ ఘటన పై క్రైస్తవుల మహా ధర్నాని నిర్వహించారు.అధిక సంఖ్యలో క్రైస్తవులందరూ పాల్గొన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer