తమిళనాడు రాష్ట్ర మైనారిటీ కమిషన్‌కు అధ్యక్షులు
తమిళనాడు రాష్ట్ర మైనారిటీ కమిషన్‌కు మూడేళ్ల కాలానికి అధ్యక్షులుగా జేసు సభకు చెందిన గురుశ్రీ జో అరుణ్‌ను నియమించారు.
ఎమ్. ఎమ్. అబ్దుల్ ఖద్దూస్ కమిషన్ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు, ఈ 10 మంది సభ్యులలో ఏ. సోర్నరాజ్, హామిల్టన్ వెల్సన్, ఏ.హెచ్. నజీముదీన్, నాగూర్, ప్రవీణ్ కుమార్ తాటియా, రాజేంద్ర ప్రసాద్, ఎమ్.రమీత్ కపూర్,జె.మహమ్మద్ రఫీ మరియు ఎస్. వసంత్ కూడా ఉన్నారు.
గురుశ్రీ అరుణ్ గారు చెన్నై జేసుసభ సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, న్యాయవాది మరియు పార్లిమెంట్ సభ్యులు.
దక్షిణ ఆసియా ఉన్నత విద్యా సచివాలయానికి చెందిన జేసుసభ కాన్ఫరెన్స్‌కు కార్యదర్శిగాను మరియు 45 సంవత్సరాల క్రితం స్థాపించబడిన చెన్నైలోని ప్రతిష్టాత్మక బిసినెస్ స్కూల్ అయిన లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిసినెస్ అడ్మినిస్ట్రేషన్ (LIBA) డైరెక్టర్‌గా గురుశ్రీ అరుణ్ గారు తన సేవను అందిస్తున్నారు
గురుశ్రీ అరుణ్ గారికి అకాడెమియా మరియు పరిశ్రమలో 23 సంవత్సరాల
అనుభవం ఉంది
అతను వ్యక్తిగత వృద్ధి, ప్రపంచీకరణ, నాయకత్వం మరియు వ్యూహంపై అనేక పుస్తకాలు మరియు శాస్త్రీయ పత్రాలను ప్రచురించాడు.
IIBM మరియు మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి MBAలు మరియు UKలోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి PhD పట్టా పొందారు.
ట్రిచీ,సెయింట్ జోసఫ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మాజీ డైరెక్టర్‌గా, ఈ సంస్థను భారతదేశంలోని అగ్రశ్రేణి వ్యాపార పాఠశాలల్లో ఒకటిగా నిలవడానికి కృషి చేశారు.
గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, లయోలా కాలేజ్ మరియు పాలయంకోట్టైలోని జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినస్ అడ్మినిస్ట్రేషన్‌లో నాయకత్వ పాత్రలను కూడా నిర్వహించారు.
ఆగస్టు 2010లో స్థాపించబడిన తమిళనాడు మైనారిటీల కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ పరిశీలించి సంబంధిత శాఖలకు తగిన పరిష్కార చర్యలను సిఫారసు చేస్తుంది