తపస్సు కాలం మన జీవితాలను నూత్నికరించే కాలమన్న పొప్ ఫ్రాన్సిస్

ఈ తపస్సు కాలంలో మన దృష్టిని మొత్తం మన కొరకు సిలువపై వేలాడిన క్రీస్తు వైపుకు తిప్పాలని పోప్ ఫ్రాన్సిస్ విశ్వ శ్రీసభను కోరారు.

అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోప్ విశ్వాసులను ఉద్దేశించి వ్రాసిన సందేశాన్ని కార్డినల్ ఏంజెలో డి డొనాటిస్ (Cardinal Angelo De Donatis) మార్చి 5, విభూది బుధవారం దివ్యబలిపూజలో ప్రసంగించారు. 

విభూది మన అంతిమ గమ్యాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు.క్రీస్తు పట్ల ధృడ విశ్వాసం కలిగి జీవిస్తే భయాలను, ఆందోళనలను, మన జీవితంలో సంభవించే కష్టాలను అధిగమించవచ్చని ఆయన విశ్వాసులకు తెలియపరిచారు.

క్రీస్తు ప్రభువు  సిలువ శ్రమలను అనుభవించి, మరణించి ఏ విధంగా అయితే మృత్యువుపై విజయకేతనాన్ని ఎగురవేశారో 

ఈ తపస్సు కాలంలో క్రీస్తును నమ్మి, విశ్వసిస్తూ ఆయన అడుగుజాడల్లో నడిచే ప్రతి ఒక్కరూ విజయం సాధిస్తారని, ఆయన నిత్యజీవపు మహిమలో పాలుపంచుకుంటారని పోప్ ఫ్రాన్సిస్ ఆయన సందేశంలో తెలిపారు.