జ్ఞానస్నానం దేవుని సన్నిహిత ప్రేమను గుర్తుచేస్తుందన్న పొప్ ఫ్రాన్సిస్
జనవరి 12, 2025, సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఆదివారం త్రికాల ప్రార్థన ప్రసంగంలో " యేసు మానవత్వంలో వ్యక్తమయ్యే దేవుని సన్నిహిత ప్రేమను "ప్రభువు బాప్తిస్మ పండుగ" గుర్తుచేస్తుందన్న పొప్ ఫ్రాన్సిస్
"మన ప్రయాణంలో ప్రతి అడుగులో మనతో పాటు వచ్చే ఏకైక వ్యక్తి క్రీస్తు ప్రభు అని ఆయన అన్నారు.
"దేవుని ప్రేమను వ్యక్తపరిచే యేసు ముఖం మరియు యేసును తన ప్రియమైన కుమారుడిగా ధృవీకరిస్తూ తండ్రి వినిపించే స్వరం అనే ద్వంద్వ అంశాలను పోప్ ఫ్రాన్సిస్ గుర్తుచేశారు.
"ప్రియమైన కుమారుని ముఖంలోనే దేవుడు నిజంగా ఎవరో మనకు తెలుసు" అని ఆయన పేర్కొన్నారు.
క్రైస్తవులు తమ బాప్టిస్మ పిలుపును ఆలోచించడం ద్వారా దేవునితో తమ సంబంధాన్ని మరింతగా పెంచుకోవాలని పోప్ ఫ్రాన్సిస్ ప్రోత్సహించారు.
క్రైస్తవులందరూ తమ బాప్టిస్మల్ తేదీని ఆధ్యాత్మిక పునరుద్ధరణ క్షణంగా గుర్తించి, దానిని పుట్టినరోజులా ఆనందంగా జరుపుకోవాలని పొప్ ఫ్రాన్సిస్ అన్నారు.
విశ్వాసులను మధ్యవర్తిత్వాన్ని కోరమని మరియు సంరక్షణకు తమను తాము అప్పగించమని ఆహ్వానించారు.