జూబ్లీ నిరీక్షణా యాత్రలో భాగంగా రోమ్ ను చేరుకున్న రష్యన్లు

2025 జూబ్లీ నిరీక్షణా యాత్రలో భాగంగా రష్యన్ కతోలీకులు పోప్ ఫ్రాన్సిస్ కోసం ప్రార్థించడానికి రోమ్ నుండి జెమెల్లి ఆసుపత్రికి కాలినడకన వెళ్లారు.

85 మంది రష్యన్ యాత్రికులు - వీరిలో ఎక్కువ మంది మాస్కో నుండి, అలాగే (St Petersburg, Kaliningrad, Vladimir,) సెయింట్ పీటర్స్‌బర్గ్, కాలినిన్‌గ్రాడ్, వ్లాదిమిర్ మరియు ఉత్తర రష్యాలోని ఇతర నగరాల నుండి కూడా - రోమ్‌కు తమ అగ్రపీఠ జూబ్లీ తీర్థయాత్రకు చాలా కాలంగా ప్రణాళిక వేసుకున్నారు 

ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, వారు మార్చి 12న పోప్ ఫ్రాన్సిస్ చేత స్వీకరించబడడానికి నిర్ణయించబడిన రోమ్ నగరానికి చేరుకున్నారు. పోప్ ఆసుపత్రిలో చేరినందున ఆ సమావేశం అసాధ్యమైంది

మాస్కో అగ్రపీఠ కాపారి  మహా పూజ్య పాలో పెజ్జీ (Paolo Pezzi )నేతృత్వంలో ఈ రష్యన్ యాత్ర జరిగింది 

యాత్రికులు రోమ్‌లోని కార్నెలియా మెట్రో స్టేషన్ నుండి జెమెల్లి ఆసుపత్రికి నాలుగు కిలోమీటర్లకు పైగా నడిచారు.

అక్కడ, వారు రెండవ జాన్ పాల్ స్వరూపం చుట్టూ గుమిగూడి పొప్ కోలుకోవాలని ప్రార్థించారు

ఈ బృందం రష్యన్ భాషలో జపమాలను జపించి మరియు లాటిన్ భాషలో దేవమాత ప్రార్ధనను పట్టించారు.