జాతీయ విద్యా సమావేశాన్ని నిర్వహించిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ జాతీయ విద్యా సమావేశం మార్చి 19 నుండి 21, 2025 వరకు ఢాకాలోని CBCB సెంటర్‌లో విజయవంతంగా జరిగింది.

బంగ్లాదేశ్ కాథలిక్ ఎడ్యుకేషన్ బోర్డు (BCEB) కారిటాస్ ఫార్మేషన్ ఫర్ యూత్ అండ్ టీచర్స్ ప్రోగ్రామ్ (FYTP) సహకారంతో బంగ్లాదేశ్‌లో కథోలిక విద్యను బలోపేతం చేయాలనే దార్శనికతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల మరియు కళాశాల ప్రధానోపాధ్యాయులు, మేత్రాసనఎడ్యుకేషన్ కమిషన్ (DEC) సభ్యులు మరియు చర్చి ప్రతినిధులు సహా ఎనిమిది మేత్రాసనాల నుండి దాదాపు 112 మంది విద్యా నాయకులు  సమావేశమయ్యారు.

"నిరీక్షణా యాత్రికులు: విద్యా నిర్మాణంలో శ్రీసభ పాత్ర" అనే ఇతివృత్తంపై బంగ్లాదేశ్‌లో కథోలిక విద్యా భవిష్యత్తు గురించి చర్చించారు.

ఢాకా అగ్రపీఠ సహాయ పీఠాధిపతి మహా పూజ్య Subroto Boniface గోమ్స్,కారితాస్ బంగ్లాదేశ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సెబాస్టియన్ రోజారియో, మరియు FYTP ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీ దౌద్ జిబోన్ దాస్ ఈ సదస్సులో పాల్గొన్నారు