జాతీయ ప్రేషిత సేవా ప్రణాళికను ఆవిష్కరించిన భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య

భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య

జాతీయ ప్రేషిత సేవా ప్రణాళికను ఆవిష్కరించిన భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య

బెంగుళూరు, సెప్టెంబరు 11, 2024 (CCBI) – కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషప్ ఆఫ్ ఇండియా (CCBI) తన కొత్త జాతీయ ప్రేషిత సేవా ప్రణాళికను " సినోడల్ చర్చ్ దిశగా ప్రయాణం: మిషన్ 2033" పేరుతో ప్రారంభించింది. సెప్టెంబర్ 11, 2024 బెంగళూరులోని సెయింట్ జాన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో జరిగిన సమావేశంలో CCBI అధ్యక్షులు కార్డినల్ మహా పూజ్య ఫిలిప్ నెరి ఫెర్రో ప్రణాళికను అధికారికంగా విడుదల చేశారు. కార్యక్రమంలో 40 మంది పీఠాధిపతులు, 27 మంది సిసిబిఐ కమీషన్ల కార్యదర్శులు మరియు సిసిబిఐలోని 14 ప్రాంతాల నుండి ప్రాంతీయ ఉప కార్యదర్శులు పాల్గొన్నారు.

పీఠాధిపతులు, గురువులు, పురుషులు, మహిళలు మరియు యువకులతో సహా 5,000 మంది సభ్యులతో ఒక సంవత్సరం ప్రక్రియను ప్రణాళికలో అనుసరిస్తారు. 2033 నాటికి శ్రీసభను దశలో చూడాలని దేవుడు పిలుపునిస్తున్నారు? అనే కీలకమైన ప్రశ్నకు సమాధానంగా ప్రణాళిక రూపొందించబడింది.

"ఇది ఆత్మలో సంభాషణల ఫలితం" అని కార్డినల్ ఫెర్రో చెప్పారు. ప్రణాళిక అనేది ఒక సమిష్టి కార్యక్రమం అని మరియు మేత్రాసన, విచారణ, ప్రాంతీయ మరియు జాతీయ స్థాయిలలో దాని సాకారానికి ప్రతి వ్యక్తి సహకరించాలని ఆయన ఉద్ఘాటించారు.

ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు ఉడిపి పీఠాధిపతి మహా పూజ్య గెరాల్డ్ ఐజాక్ లోబో నేతృత్వంలోని ఒక కమిటీని ఏర్పాటు చేశారు, ఇది జాతీయ, ప్రాంతీయ మరియు మేత్రాసన స్థాయిలలో CCBI యొక్క కమీషన్లు, విభాగాలు మరియు అపోస్టోలేట్ల ద్వారా రూపొందించబడుతుంది.

జాతీయ ప్రేషిత సేవా ప్రణాళిక ప్రతులను పొందేందుకు ఆసక్తి ఉన్నవారు, దయచేసి [email protected] ని సంప్రదించండి లేదా మొబైల్: 91-9886730224కు కాల్ చేయండి.