ఘనంగా పరిశుద్ధ సిలువ విజయ మహోత్సవ పండుగ

ఘనంగా పరిశుద్ధ సిలువ విజయ మహోత్సవ పండుగ
హైదరాబాద్ అతిమేత్రాసనం, వనస్థలిపురం విచారణ పరిశుద్ధ సిలువ దేవాలయంలో పరిశుద్ధ సిలువ విజయ మహోత్సవ పండుగ ఘనంగా జరిగింది. విచారణకర్తలు గురుశ్రీ పులి అశోక్ కుమార్ , HGN గారి ఆధ్వర్యంలో జరిగాయి.
హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య పూల అంతోని గారు పండుగ మహోత్సవ సమిష్టి దివ్యబలి పూజను ఇతర గురువులతో కలసి సమర్పించారు. సుమారు 20 మంది
గురువులు మరియు 10 మంది సిస్టర్స్ పాల్గొన్నారు.
ఈ దివ్య పూజలో 26 మంది చిన్నారులు నూతన దివ్యసత్ప్రసాదాన్ని మరియు భద్రమైన అభ్యంగనం సీకరించారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.
పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికి విచారణకర్తలు గురుశ్రీ పులి అశోక్ కుమార్ , HGN గారు ధన్యవాదాలు తెలిపారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer