ఘనంగా ఆరోగ్యమాత మహోత్సవం

ఘనంగా ఆరోగ్యమాత మహోత్సవం
కడప మేత్రాసనం, ఆరోగ్యమాత పుణ్య క్షేత్రంలో 8 సెప్టెంబర్ 2024 న ఆరోగ్యమాత మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలు పుణ్యక్షేత్రం డైరెక్టర్ గురుశ్రీ MD ప్రసాద్ గారి అద్వర్యంలో జరిగాయి.
విశ్వసించిన వారికి ఆరోగ్యమాత వరాలు, దీవెనలు అందించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందజేస్తుందని కడప మేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య డాక్టర్ గాలి బాలి అన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన మహా పూజ్య డాక్టర్ గాలి బాలి గారు మాట్లాడుతూ నగరంలో ఆరోగ్యమాత ఉండడం రాయలసీమ ప్రాంతానికి ఆశీర్వాదకరమని, పది రోజులుగా ఆరోగ్యమాత నవదిన పూజా ప్రార్ధనలు వైభవంగా జరిగాయన్నారు. కార్యక్రమంలో మేత్రాసన వికర్ జనరల్ గురుశ్రీ తలారి బాలరాజు గారు , కోశాధికారి గురుశ్రీ సురేష్ గారు మరియు ఇతర మేత్రాసన గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరియాపురం దేవాలయం వద్ద నుంచి అలంకరించిన పల్లకీలో మరియమాత స్వరూపాన్ని ఊరేగింపుగా ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంకి తీసుకువచ్చారు. నగరంలోని ప్రముఖ కూడళ్ల మీదుగా ఊరేగింపు సాగింది. రంగురంగుల విద్యుద్దీపాలు, పూల అలంకరణతో ఊరేగింపు వైభవంగా సాగింది. ఈ ఊరేగింపులో వల్లూరు విచారణ గురువులు గురుశ్రీ కారు శరత్, సిద్ధవటం గురువులు గురుశ్రీ జాన్, ఆరోగ్యమాత, యువత మేత్రాసన గురువులు, కన్య స్త్రీలు, అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer