"గర్భవిచ్చిత్తి చేయించుకోవాలనే ఒత్తిడి నుండి మహిళలకు విముక్తి కల్పించాలన్న పొప్ ఫ్రాన్సిస్

రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో న్యుమోనియా నుండి కోలుకుంటున్న పొప్, ఇటాలియన్ మూవ్‌మెంట్ ఫర్ లైఫ్ నిర్వహించిన తీర్థయాత్రలో పాల్గొన్నవారికి ఒక సందేశాన్ని పంపారు.
మార్చి 8,శనివారం సెయింట్ పీటర్స్ బసిలికాలో గుమిగూడిన యాత్రికులకు దివ్యబలిపూజలో స్టేట్ సెక్రటరీ కార్డినల్ పియట్రో పరోలిన్ పోప్ తరపున సందేశాన్ని చదివారు.
1975లో స్థాపించబడిన ఇటాలియన్ మూవ్‌మెంట్ ఫర్ లైఫ్‌ను పోప్ ప్రశంసించారు.
వీరు గర్భిణీ స్త్రీలకు లేదా గర్భవిచ్చిత్తి చేయించుకోవాల్సిన ఒత్తిడిలో ఉన్న మహిళలకు సహాయం చేసే అనేక కేంద్రాలను స్థాపించి తమ సేవను అందిస్తున్నారు.
“స్వాధీనం, చర్య, ఉత్పత్తి మరియు ప్రదర్శన”పై దృష్టి సారించి సమకాలీన సమాజం మహిళలపై ఉంచే ఒత్తిడిని ఆయన విచారించారు.
స్త్రీలను “తమ బిడ్డకు జన్మనివ్వకుండా ఆపే ఒత్తిళ్ల నుండి” విముక్తి కలిపించే “ప్రేమ నాగరికతను” పెంపొందించుకోవాలని పోప్ ఫ్రాన్సిస్ క్రైస్తవులకు పిలుపునిచ్చారు.
పుట్టబోయే పిల్లలను “మనలో ఒకరు”గా గుర్తించడానికి “హృదయ దృష్టి” అవసరమని ఆయన అన్నారు.
50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా,ప్రతి ఒక్కరు "మాతృత్వానికి, సామాజిక రక్షణ మరియు మానవ జీవితాన్ని దాని అన్ని దశలలో అంగీకరించడాన్ని ముందుకు తీసుకెళ్లాలని" పోప్ ఫ్రాన్సిస్ కోరారు.