క్రైస్తవుల సహాయమాత మహోత్సవం

క్రైస్తవుల సహాయమాత మహోత్సవం

విశాఖ అగ్రపీఠం,వేపాడ విచారణలో  క్రైస్తవుల సహాయమాత మహోత్సవం తేది 24-05-2024 శుక్రవారం నాడు జరగనున్నది.21  మే 2024  సాయంత్రం 5 గంటలకు పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులుగా మాడుగుల విచారణ కర్తలు గురుశ్రీ వి. ప్రాన్సిస్ గారు పాల్గొన్నారు.

త్రిదిన పూజ ప్రార్ధనలు లో భాగంగా తేది 21-05-2024 మంగళవారం నుండి 23-05-2024 గురువారం వరకు ప్రతి రోజు సాయంత్రం 5.30 ని॥లకు జపమాల అనంతరం  దివ్యబలి పూజ జరుగుతున్నాయి. జపమాలను బల్లంకి, సింగరాయి, కరకవలస, ఆనందపురం, పెదగుడిపాల, దబ్బరాజుపేట, వీలుపర్తి, రాయుడుపేట,వల్లంపూడి, వేపాడ మేరీనగర్, దేవరాపల్లి, ఎస్.కె. ఆర్. పురం గ్రామల విశ్వాసులు నిర్వహించనున్నారు.

24 మే 2024 శుక్రవారం పండుగ రోజు  పర్వదిన కార్యక్రమములో భాగంగా సాయంత్రం 5 గం||లకు మహాపుర ప్రదక్షణ కార్యక్రమము అనంతరం సాయంత్రం 6.30గం||లకు విశాఖఅతిమేత్రాసన నూతన గురువులు గురుశ్రీ  పి. ఆంతోని రాజ్,గురుశ్రీ పి. రవితేజ, గురుశ్రీ  యస్. తోమస్ మరియు ఇతర గురువులచే మహోత్సవ దివ్య పూజాబలి నిర్వహించనున్నారు.

విశ్వాసులందరిని ప్రేమతో ఆహ్వానించువారు విచారణ గురువు గురుశ్రీ  బి. బాలరాజు గారు మరియు  జె.యం.కె. యూత్ మరియదళ సభ్యులు విచారణ సలహాసంఘ సభ్యులు మరియు విశ్వాసులు. గురుశ్రీ  బి. బాలరాజు గారు దివ్యబలిపూజ అనంతరం ప్రజలందరికి ప్రేమవిందుని ఏర్పాటు చేసారు.

 

Article and design by

 M.kranthi swaroop

RVA Telugu online producer