క్రీస్తులో నిరీక్షణ నిరాశపరచదన్న పొప్ ఫ్రాన్సిస్
సోమవారం జనవరి 20 న ఫిన్లాండ్ నుండి పునీతహెన్రిక్ స్మరణ రోజున రోమ్కు ప్రయాణించిన క్రైస్తవ ప్రతినిధి బృందంతో పోప్ ఫ్రాన్సిస్ సమావేశమయ్యారు.
సాధారణంగా క్రైస్తవ ప్రతినిధి బృందం ప్రతీ ఏటా క్రైస్తవ సమైక్యత వారోత్సవాలు జనవరి 18–25 తేదీలలో పొప్ ఫ్రాన్సిస్ ని సందర్శిస్తారు.
ఈ 2025 జూబిలీ సంవత్సరంలో మనం "నిరీక్షణా యాత్రికులు"గా కలిసి ప్రయాణిదాం అని పోప్ పిలుపునిచ్చారు.
క్రీస్తులో నిరీక్షణ నిరాశపరచదన్న "ఎందుకంటే జనన మరణాలు కూడా మనలని ఆ 'దేవుని ప్రేమ నుండి వేరు చేయలేవు' అని పోప్ ఫ్రాన్సిస్ గుర్తు చేసారు
హాజరైన వారితో ప్రభువు నేర్పిన ప్రార్థనను జపించి వారి సందర్శనకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారిని ఆశీర్వదిస్తూ ముగించారు.