కొచ్చిన్ మేత్రాసన అపోస్తల పరిపాలనాధికారిగా మహా పూజ్య జేమ్స్ నియామకం

అక్టోబర్ 12, 2024 న అలెప్పీకి చెందిన మహా పూజ్య జేమ్స్ రాఫెల్ అనపరంబిల్ గారు కొచ్చిన్ మేత్రాసన అపోస్తల పరిపాలనాధికారిగా నియమితులయ్యారు.

మార్చి 2, 2024న మహా పూజ్య జోసఫ్ కరియిల్ పదవీ విరమణ చేయడంతో కొచ్చిన్ మేత్రాసనం ఖాళీగా ఉంది.

మహా పూజ్య జేమ్స్ గారు మార్చి 7, 1962న అలెప్పీ జిల్లాలోని చెల్లానంలో జన్మించారు.

ఆయన ఆల్వేలోని మేజర్ సెమినరీలో తన గురువిద్యను పూర్తి చేసారు మరియు రోమ్‌ నగరంలోని పొంటిఫికల్ అర్బనియన్ విశ్వవిద్యాలయంలో బైబిల్ వేదాంతశాస్త్రాన్ని  అభ్యసించి డాక్టరేట్ పొందారు 

అయన పొంటిఫికల్ గ్రెగోరియన్ విశ్వవిద్యాలయం నుండి జుడాయిజంలో మాస్టర్స్ పొందారు.

డిసెంబరు 17, 1986న అలెప్పీ మేత్రాసనానికి గురువుగా అభిషేకింపబడ్డారు 

1986-1987 వరకు థంప్లీ, సెయింట్ థామస్ విచారణ చాప్లిన్ గా 

1989 నుండి 1993 వరకు అలెప్పి లోని మైతారా సేక్రేడ్ హార్ట్ మైనర్ సెమినరీ ప్రిఫెక్ట్ మరియు ప్రొక్యూరేటర్ గా 

1989 నుండి 1993  వరకు  ఆఫ్ వోకేషన్స్ సెంటర్ మేత్రాసన డైరెక్టర్ గా 

1998 నుండి 2013 వరకు కార్మెల్‌గిరి, సెయింట్ జోసెఫ్ పోంటిఫికల్ సెమినరీ బైబిల్ వేదాంతశాస్త్రం మరియు హిబ్రూ ప్రొఫెసర్ గా 

2003 నుండి  2006 వరకు ఆల్వే వేదాంతశాస్త్ర  మరియు తత్వశాస్త్ర ఫ్యాకల్టీ ప్రెసిడెంట్ గా , 

2009 నుండి 2012 వరకు కార్మెల్‌గిరి సెయింట్ జోసెఫ్స్ పోంటిఫికల్ సెమినరీ రెక్టర్ గా 

2014 నుండి  2016 వరకు అలెప్పీ వికార్ జనరల్ గా 

7 డిసెంబర్ 2017న అలెప్పీ కోడ్జూటర్ పీఠాధిపతిగా నియమితులై మరియు ఫిబ్రవరి 11, 2018న పీఠాధిపతిగా అభిషేకింపబడ్డారు.

అక్టోబరు 11, 2019న అలెప్పీ పీఠాధిపతులుగా బాధ్యతలు స్వీకరించారు.