కర్నూలు మేత్రాసనం, మదర్ థెరిసా దేవాలయ మహోత్సవం

సెప్టెంబర్ 6 ,2024 న కర్నూలు మేత్రాసనం, బనగానపల్లె విచారణ మదర్ థెరిసా దేవాలయ పండుగ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడారు. 

విచారణ పాలక పునీతురాలు మదర్ థెరిసా పండుగను పురస్కరించుకుని కర్నూలు పీఠాధిపతులు మాన్యశ్రీ డా.గోరంట్ల జ్వానాస్  దివ్యబలి పూజను సమర్పించారు. వారు తమ ప్రసంగంలో మదర్ థెరిసా గారు ఒక సాధారణమైన మఠ కన్య; దేవుని శక్తితో, ప్రార్థన బలముతో, మంచి మనసుతో భారత దేశంలో మరియు ప్రపంచ దేశాలలో తన యొక్క సేవలను చేసినటువంటి గొప్ప మాతృమూర్తి అని కొనియాడినారు. 

ప్రతి ఒక్కరు కూడా మదర్ థెరెసాని ఆదర్శనంగా తీసుకుని మన కుటుంబంలో వారిని మరియు మన విచారణలో ప్రజలను ప్రేమతో అక్కున చేర్చుకుని వారికీ సేవలు అందించాలని పిలుపునిచ్చారు. పదిహేను మంది మేత్రాసన గురువులు 

ఈ దివ్యబలి పూజలో పాలుపంచుకున్నారు. మరియు 10 మంది మఠ కన్యలు, 800 మంది బనగానపల్లి విచారణ వాసులు ఈ దివ్యబలి పూజలో పాలుపంచుకున్నారు. విచారణ కర్తలు గురుశ్రీ బాబు రాజు గారు దివ్య బాలి పూజను సమర్పించి విచారణ విశ్వాసులకోసం విచారణ అభివృధ్ధికోసం ప్రత్యేకంగా ప్రార్ధించారు. 

దివ్యబలి పూజను సమర్పించినటువంటి కర్నూలు మేత్రానులకు ధన్యవాదాలు తెలియచేసారు. అదేవిధంగా పండుగ పూజలో పాల్గొన్నటువంటి గురువులకు, మఠవాసులకు మరియు గాయక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు.