కడప పీఠానికి నూతన పీఠాధిపతిని నియమించిన పొప్ ఫ్రాన్సిస్

కడప పీఠానికి నూతన పీఠాధిపతిగా గురుశ్రీ సగినాల పాల్ ప్రకాష్ గారిని ఎన్నుకుంటూ జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ ఉత్తర్వులు జారీ చేశారు.
మార్చి 8న భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు రోమ్ నుండి ఈ ప్రకటన వెలువడింది.
గురుశ్రీ సగినాల పాల్ ప్రకాశ్ 1960లో కడప పీఠంలోని బద్వేల్ నందు జన్మించారు.
ఏప్రిల్ 27, 1987న గురువుగా అభిషేకం పొంది అదే సంవత్సరం చిత్తూరులో సహాయక గురువుగా సేవలందించారు.
1994-98లో రోమ్ నగరము నందు బైబిల్ వేదాంత శాస్త్రంలో గౌరవ డాక్టరేట్ పొందారు.
పునీత యోహాను ప్రాంతీయ గురువిద్యాలయం మరియు హైదరాబాద్ అగ్రపీఠ పరిధిలోని ఇతర గురు విద్యాలయాల్లోను వేదాంతాచార్యునిగా సేవలందించారు.
ఈయన మంచి రచయిత. వీరి కలం నుండి అనేక బైబిల్ సాహిత్య రచనలు ప్రచురితమయ్యాయి.
ముఖ్యంగా వీరు వ్రాసిన "క్రైస్తవ సంజ్ఞలు - సూచికలు" అనే పుస్తకం, దీనికి సంబంధించి దివ్యవాణి టీవీ ఛానల్ లో ప్రసారమైన కార్యక్రమం బహుళ ప్రాచుర్యం పొందింది.
నూతన పీఠాధిపతిగా ఎన్నికైన మోన్సిన్యోర్ సగినాల ప్రకాశ్ గారికి దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించి నడిపించాలని మనం అంతా కోరుకుందాం