ఉక్రెయిన్‌కు నాలుగు అంబులెన్సులను బహుమతిగా పంపిన పొప్ ఫ్రాన్సిస్

ఉక్రెయిన్‌కు నాలుగు అంబులెన్సులను పొప్ ఫ్రాన్సిస్ బహుమతిగా పంపినట్లు ఏప్రిల్ 7 న వాటికన్ ప్రకటించింది. ఇవి యుద్ధ ప్రాభావిత ప్రాంతాలలో వినియోగించబడతాయని వారు తెలిపారు.

పోప్ ఈ నాలుగు అంబులెన్స్లను ఆశీర్వదించి, జగద్గురువుని పరిపాలన యంత్రాంగంలోని దాతృత్వ సేవా విభాగ అధ్యక్షులు కార్డినల్ Konrad కు వీటిని అప్పగించి ఉక్రెయిన్ కు  చేరే విధంగా చూసుకోవాలని ఆయన కోరారు.

ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం ఆరంభమైన దగ్గర నుండి పోప్ ఈ యుద్ధం ఆపబడాలని శాంతి నెలకొనాలని కోరిన విషయం మనందరికీ తెలిసినదే.

ఉక్రెయిన్ యుద్ధ బాధితుల పట్ల సానుభూతిని ప్రకటిస్తూ, ఎన్నో విలువైన వైద్య పరికరాలతో కూడిన ఈ అంబులెన్స్లను ఇవ్వడం మరోసారి జూబ్లీ నిరీక్షణ యొక్క వ్యక్తీకరణను సూచిస్తుంది.