ఆఫ్రికన్ రాయబారులను, జూబ్లీ తీర్థయాత్రికులను కలిసిన పోప్

సెయింట్ పీటర్స్ బసిలికాలో సోమవారం మే 26 మధ్యాహ్నం ఆఫ్రికన్ ఖండం రాయబారులు, జూబ్లీ తీర్థయాత్రలో పాల్గొన్న విశ్వాసుల కొరకు దివ్యబలిపూజను సమర్పించారు
62వ ఆఫ్రికా దినోత్సవం మరుసటి రోజు XIV లియో పోప్ ప్రతినిధులను పలకరించడానికి మరియు వారిని ప్రోత్సహించడానికి అప్రకటితంగా కలిశారు
2025 జూబిలీ సంవత్సరం "మనందరికీ స్ఫూర్తినివ్వడమే కాకుండా, నిరీక్షణా సంకేతాలుగా ఉండటానికి మనందరినీ ఆహ్వానిస్తుంది" అని పోప్ అన్నారు.
"జ్ఞానస్నానం పొందిన ప్రతి వ్యక్తి ఆ దేవాదిదేవుని పిలుపును ఆలకించి ప్రస్తుత ప్రపంచానికి నిరీక్షణా సంకేతాలుగా నిలవాలని పోప్ జోడించారు.
ఆదివారాల్లో,తీర్థయాత్ర సమయంలో మాత్రమే కాకుండా ప్రతిరోజూ ఆ ప్రభువుపై విశ్వాసం తో జీవించాలని మన జీవితాలను మలచుకోవాలని పొప్ అన్నారు