ఆదివారం సత్యోపదేశ సంక్షేమ వార్షిక దినోత్సవం

25 ఫిబ్రవరి 2024న సాయంత్రం 5:30 గంటలకు వరంగల్ మేత్రాసనం, ఫాతిమామాత కథడ్రల్ నందు 2024 విద్యా సమవత్సరంలో ఆ దేవుని దీవెనలు విచారణ బాలబాలికలపై కురిపించినందుకు కృతజ్ఞతగా దివ్యబలి పూజను అర్పించారు.

వరంగల్ మేత్రానులు మహా పూజ్య ఉడుమల బాల తండ్రిగారు (ప్రధానార్చకులుగా), విచారణ కర్తలు గురుశ్రీ కాసు మర్రెడ్డి గారు మరియు విచారణ సహాయక గురువు గురుశ్రీ కరుణాకర్ SJ కలిసి దివ్యబలి పూజను సమర్పించారు.
 
ఈ వార్షికోత్సవంలో విచారణలో ఉన్న1 నుండి 9వ తరగతుల బాలబాలికలు పాల్గొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించారు.

అనంతరం పీఠాధిపతులవారు ఆదివార సత్యోపదేశ సంక్షేమ తరగతులకు 100% హాజరైన పిల్లలకు బహుమతుల అందచేసి విశ్వాసంలో ఎదగాలని ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు.

ఈ వార్షిక దినోత్సవ వేడుకలో దాదాపు 150-200 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు విచారణ విశ్వాసులు పాల్గొన్నారు

Tags