అర్జెంటీనా ప్రీస్ట్లీ కాలేజ్ ఆఫ్ రోమ్ వేదాంతాచార్యులతో సమావేశమైన పొప్ ఫ్రాన్సిస్
అర్జెంటీనా ప్రీస్ట్లీ కాలేజ్ ఆఫ్ రోమ్ గురువిద్యాలయానికి చెందిన గురువిద్యార్థులతో, వేదాంతాచార్యులతో, గురువులతో జనవరి 16న పొప్ ఫ్రాన్సిస్ సమావేశమయ్యారు
అర్జెంటీనా పునీత జోస్ గాబ్రియేల్ డెల్ రోసారియో బ్రోచెరో (Saint Jose Gabriel del Rosario Brochero)గురువును ఉదాహరణను అనుకరించాలని, దివ్యబలిపూజ ద్వారా మరియు ఇతరులకు సేవ చేయడం ద్వారా ప్రభువుకు దగ్గరవ్వాలని వారిని పొప్ ఫ్రాన్సిస్ కోరారు
గురుత్వం దేవుడిచ్చిన గుర్తింపని ఆయన అన్నారు. 2016లో ఫాదర్ జోస్ గాబ్రియేల్ డెల్ ను పునీతులుగా ప్రకటించారు.
ఈ పునీతుడు తన గురుత్వ జీవితాన్ని ఏ విధంగా దేవునికి అర్పించి, పునీత స్థాయికి ఎదిగారో,ప్రతి గురువు ఈ పునీతుని సుమాతృకను అనుసరించి ,దైవమార్గంలో అడుగులు వేయాలని,దైవాంకిత వృత్తికి వన్నె తేవాలని ఆయన ఆకాంక్షించారు.
గురువులు తమ సంపూర్ణ జీవితాన్ని క్రీస్తుకు అంకితమిచ్చి, దైవ మానవ సేవలో వర్ధిల్లుతూ, దేవునికి దగ్గర అవ్వాలని పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు.