అనారోగ్యం నుండి కోలుకుని దివ్యబలిపూజలో పాల్గొన్న పోపు ఫ్రాన్సిస్

మార్చి 16 ఆదివారం ఉదయం అనారోగ్యం నుండి కోలుకుంటున్న పొప్ ఫ్రాన్సిస్ జెమెల్లి ఆసుపత్రి నందు గల ప్రార్థనాలయంలో దివ్యబలిపూజలో పాల్గొన్న వారి ఛాయాచిత్రాన్ని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసింది.
ఫిబ్రవరి 14న ఆసుపత్రిలో చేరిన తర్వాత ఇది మొదటి ఛాయాచిత్రం.
పోప్ ఫ్రాన్సిస్ వైద్య పరిస్థితి స్థిరంగా ఉంది మరియు శ్వాసకోశ చికిత్స మరియు ఫిజియోథెరపీ కొనసాగుతున్నాయి.
దుఃఖ సమయాల్లో మన జీవితాలలో వెలుగును ప్రకాశింపజేసే వ్యక్తులను దేవుడు మన పక్షాన నిలబెడతారని అందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని పొప్ కోరారు.
మన శరీరాలు బలహీనంగా ఉన్నా, ఇతరులను ప్రేమించడం, వారికొరకు ప్రార్థించటం,విశ్వాస వెలుగులో ప్రయాణిస్తూ మనల్ని ఆ దేవునికి అర్పించుకోవడం ద్వారా దేవుని వెలుగును, ప్రత్యక్షతను మన జీవితాల్లో పొందుకోవచ్చని పోప్ అన్నారు.
అదేవిధంగా ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్న వారందరికీ,చికిత్సను అందిస్తున్న ఆసుపత్రి సిబ్బందికి పోప్ కృతజ్ఞతలు తెలియపరిచారు.