"పర్యావరణ కేంద్రాలను" ఏర్పాటు చేయనున్న ఫిలిప్పీన్స్ పీఠాధిపతులు
కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫిలిప్పీన్స్ (CBCP) సామాజిక అభివృద్ధి విభాగం వారు దేశంలోని వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని కారితాస్ ఫిలిప్పీన్స్ వారు మొత్తం 86 మాత్రాసనాలలో "పర్యావరణ కేంద్రాలను" ఏర్పాటు చేయనుంది.
డిసెంబర్ 14, CBCP నేషనల్ లౌదాతసి కార్యక్రమ అధ్యక్షులు శాన్ కార్లోస్ మేత్రాసనానికి చెందిన జెరార్డో అల్మినాజా గారు జనవరి 2024లో జరగబోయే పీఠాధిపతుల ప్లీనరీలో దేశంలోని పీఠాధిపతులను "పర్యావరణ కేంద్రాలను" ఏర్పాటు చేయాలని కోరుతానని తెలిపారు.
"మేము 100 శాతం లక్ష్యంగా పెట్టుకుంటాము-అన్ని మేత్రాసనాలలో పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, కథోలిక దేవాలయాలు పర్యావరణ ప్రచారంలో పూర్తిగా నిమగ్నమవ్వగలవు" అని కారితాస్ ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షులు మహా ఘన అల్మినాజా గారు అన్నారు.
“బలహీనమైన వర్గాల వాణిగా పనిచేయడమే మా పని, వాతావరణ సంక్షోభం కారణంగా తీవ్రంగా నష్టపోతున్న ప్రజల కథనాలను మనం చర్చల పట్టికకు తీసుకురావాలి, ”అని బిషప్ గారు అన్నారు.
"వాతావరణ చర్చ, లేదా COP, ఒక స్థలం మాత్రమే." పర్యావరణ చౌర్యంపై పోరాడుతున్న ప్రాంత ప్రజలతోనే మనం గెలవడమే అసలైన పోరాటం అన్నారు.
ఫిలిప్పీన్స్, ఒక ద్వీపము, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో పాటు, సంవత్సరంలో దాదాపు 20 టైఫూన్‌లను ఎదుర్కొంటుంది.