పర్యావరణను పరిరక్షించడానికి నడుము బిగించిన కన్యస్త్రీలు 

కన్యస్త్రీలు
కన్యస్త్రీల బృందం

పర్యావరణంపై పోప్ ఫ్రాన్సిస్ ఎన్సైక్లికల్ స్ఫూర్తితో ఫిలిప్పీన్స్‌లోని కన్యస్త్రీల బృందం చెత్తను సేకరించే సమాజ సేవను ప్రారంభించింది.

"లౌదాతోసి, ఆన్ ది కేర్ ఆఫ్ అవర్ కామన్ హోమ్" 2015లో ప్రచురించబడింది.

"జూలై 2న ఆదివారం దివ్యబలిపూజ తర్వాత, మేము తిరిగి కాన్వెంట్‌కి వెళ్లే దారి పొడవునా చెత్తను సేకరించడం ప్రారంభించాము" అని SCG, కమ్యూనిటీ హెడ్ సిస్టర్ సోఫియా ఓషితా అన్నారు, "మా ఈ చిన్న చిన్న పనులు "భూమి యొక్క ఆక్రన్దనాలకు సమాధానమిద్దాం" అనే మా లక్ష్యానికి మమ్మల్ని చేరువ చేయగలవు అని ఆమె అన్నారు. 

ఆమె కరిథాస్ సిస్టర్స్ ఆఫ్ జీసస్‌లో సుయోర్ డెల్లా కారిటా డి గెసో (SCG) సభ్యురాలు.

ఒక వియత్నామీస్ మరియు ఐదుగురు జపనీస్ కన్యస్త్రీలు బినాన్, లగునాలోని కరిథాస్ డాన్ బాస్కో స్కూల్‌లో పని చేస్తున్నారు, ఇది దేశ రాజధాని మనీలాకు ఆగ్నేయంగా ఉంది.

"లౌదాతోసి యొక్క ఏడు లక్ష్యాల కోసం మేము ప్రతి నెలా ఏదో ఒక ప్రణాళికను కలిగి ఉన్నాము. చెత్తను సేకరించడం, వేరు చేయడం మరియు వాటిని సరిగ్గా పారవేయడం మా కార్యకలాపాలలో ఒకటి" అని సిస్టర్ ఒషిత చెప్పారు.

" ఒక సంఘంగా, మేము లౌదాతోసి లో పాల్గొంటాము. ప్రతి సంఘం పోప్ ఫ్రాన్సిస్ పిలుపుకు ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తుంది మరియు ఉమ్మడి మంచి కోసం, ముఖ్యంగా పర్యావరణం పట్ల శ్రద్ధ వహిస్తుంది," అని ఆమె అన్నారు.

"మేము రహదారి పొడవునా చెత్త గురించి ఆందోళన చెందుతున్నాము. ఈ చెత్తను మరియు రహదారి వెంబడి కుక్కల విసర్జితాలను ఎవరూ పట్టించుకోరు; అసలు నిజమైన ఆందోళన ఇక్కడి ట్రాఫిక్" అని ఆమె వివరించారు.

"మాకు అప్పగించబడిన పని పాఠశాలను నడపడమే. మేము మా రోజువారీ పనిలో చాలా బిజీగా ఉన్నాము. కానీ ఆదివారం, మేము దివ్యబలిపూజ నుండి తిరిగి వస్తున్నప్పుడు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సులభం అనిపించింది. ఈ చిన్న చర్య ప్రజలకు పర్యావరణంపై అవగాహన కలగడానికి వారి ఆలోచనలను మార్చడానికి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. అని సిస్టర్ ఒషిత చెప్పారు.

ఆదివారం రద్దీ తక్కువగా ఉన్నందున పరిసరాల్లో చెత్తను సేకరించాలని ఈ కన్యస్త్రీలు  నిర్ణయించుకున్నారు.