ఆగ్నేయాసియ వరద బాధితుల కొరకు ప్రార్దించిన పోప్ లియో
ఆదివారం డిసెంబర్ 7 త్రికాలప్రార్ధన అనంతరం దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో వరదల వల్ల జరిగిన నష్టానికి పోప్ లియో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాలలో ఇటీవలి రోజుల్లో వరదలు మరియు కొండచరియలు విరిగిపడటం వల్ల 1,500 మందికి పైగా మరణించారు.
ప్రస్తుత మరణాల సంఖ్య ఇండోనేషియాలో 883 మంది, శ్రీలంకలో 486 మంది, థాయిలాండ్‌లో 185 మంది మరియు మలేషియాలో ముగ్గురు
ప్రకృతి వైపరీత్య బాధితుల కొరకు, మరియు ప్రాణ నష్టం వల్ల విచారిస్తున్న కుటుంబాల కొరకు పోప్ ప్రత్యేకంగా ప్రార్ధించారు
అంతర్జాతీయ సమాజాల మానవతా సహాయం ఎప్పుడు వీరికి చాల అవసరమని పోప్ అన్నారు.
"ఇటీవలి ప్రకృతి వైపరీత్యాల ద్వారా తీవ్రంగా పరీక్షించబడిన దక్షిణ మరియు ఆగ్నేయాసియా ప్రజలకు నేను దగ్గరగా ఉన్నాను" అని ఆయన అన్నారు.