కొండచరియలు విరిగిపడే ముందు మైఖేల్ హెచ్చరికలను చాలామంది పట్టించుకోలేదు

కొండచరియలు విరిగిపడే ముందు మైఖేల్ హెచ్చరికలను చాలామంది పట్టించుకోలేదు
దక్షిణ కేరళలోని వాయనాడ్ జిల్లాలోని ముండక్కైలో నివసిస్తున్న 63 ఏళ్ల జ్ఞానప్రకాష్ మైఖేల్
జూలై 29న తన ఇంటికి సమీపంలో ఉన్న రాతి నిర్మాణం నుండి బురద నీరు బయటకు రావడం చూసి బయపడి, ఏదో జరగబోతుంది అని గ్రహించి తన భార్య గుణవతి మేరీతో కలసి తన బంధువుల ఇంటికి వెళ్ళిపోయాడు.
జూలై 30 తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో మైఖేల్ గ్రామంలో పొరుగువారితో పాటు జిల్లాలోని ముండక్కై, చూరల్‌మల అత్తమాల మూడు గ్రామాలలో వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి.
మైఖేల్ ఊరువిడిచి వెళ్తున్న సమయంలో ముండక్కై ప్రాంతంలోని చాలా మంది నివాసితులు అతని హెచ్చరికను సీరియస్‌గా తీసుకోలేదు. "నేను ఇద్దరు స్నేహితులను, మరొకొందరిని హెచ్చరించాను" కాని వారు పట్టించుకోలేదు అని అతను UCA న్యూస్ తో చెప్పాడు.
వారి ఆచూకీ తెలియరాలేదని, ప్రస్తుతం 3,500 మంది నివసిస్తున్న 16 సహాయ శిబిరాల్లో వెతికిన తర్వాత ఆయన చెప్పారు.మైఖేల్ తన ఇంటిని కూడా కోల్పోయాడు.తన ప్రాణాలను కాపాడినందుకు "దేవునికి కృతజ్ఞతలు" అని మైఖేల్ చెప్పాడు. శిబిరాల్లో ఉన్న అనేక మంది తమ బంధువులను కోల్పోయారని ఆయన అన్నారు.
వివిధ క్రైస్తవ దేవాలయాలు, సంస్థలు కనీసం 2,000 మందిని ఉంచే సహాయ శిబిరాలను నిర్వహిస్తున్నాయి."మేము వారికి ఆహారంతో సహా అన్ని ప్రాథమిక అవసరాలను అందిస్తాము" అని బాధిత ప్రాంతానికి సమీపంలోని మెప్పాడిలోని సెయింట్ జోసెఫ్ దేవాలయ విచారణ కర్తలు గురుశ్రీ సన్నీ అబ్రహం గారు అన్నారు.
శిబిరాల్లో సరిపడా ఆహారం, ఇతర అవసరాలన్నీ ఉన్నాయని ఫాదర్ గారు తెలిపారు. "కానీ భవిష్యత్తు ప్రజలను సవాలు చేస్తుంది. ఈ శిబిరాల నుండి వారు ఎక్కడికి వెళతారు?"
"నిరాశ్రయులైన భావన భయంకరమైనది. వారికి, వారి స్వంత స్థలం ఉండటం చాలా ముఖ్యమైనది," అని గురుశ్రీ సన్నీ అబ్రహం గారు అన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer