మీ ఫోన్‌లను పక్కనపెట్టి, మానవ సంబంధాలపై దృష్టి పెట్టండి - పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు
మీ ఫోన్‌లను పక్కనపెట్టి, మానవ సంబంధాలపై దృష్టి పెట్టండి - పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు
జగద్గురువులు మహా పూజ్య పోప్ ఫ్రాన్సిస్ ,నిన్న ఇటాలియన్ నగరమైన వెనిస్‌ను సందర్శించారు. ఆదివారం ఉదయం వెనిస్‌లోని "బసిలికా ఆఫ్ సెయింట్ మేరీ ఆఫ్ గుడ్ హెల్త్" ఆవరణలో సమావేశమైన యువకులతో మాట్లాడారు .
జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ "మనమందరం దేవుని ప్రియమైన పిల్లలు అనే గొప్ప బహుమతిని అందుకున్నామని, పొందుకున్న ప్రేమను, ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడానికి మనమంతా పిలవబడ్డామని ఆయన అన్నారు. ఈ సందర్భముగా మరియమాత జీవితాన్ని ఉదాహరిస్తూ, దేవుని తల్లి అవుతుందన్న శుభవార్తను విన్న మరియమాత వెంటనే లేచి తన బంధువు ఎలిజబేతమ్మ దగ్గరకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసారు.
దేవుడు మనకు సహాయం చేసి ఉన్నత స్థితిలో ఉంచేలా సహాయపడతారు అని, మనం స్వర్గం కోసం సృష్టించబడ్డాము అని, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలనుండి "లేవండి" అని పోప్ ఫ్రాన్సిస్ వెనిస్‌లోని యువకులను ఉద్దేశించి అన్నారు.
నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ తమ సెల్‌ఫోన్‌తో తమంతట తాముగా సోషల్ మీడియా మరియు వీడియో గేమ్‌లకు అతుక్కుపోయారు,’’స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక మనుషుల్లో సహజసిద్ధమైన ఆత్మీయ పలకరింపులు పూర్తిగా తగ్గిపోయాయి అని, మీ ఫోన్‌లను పక్కనపెట్టి, మానవ సంబంధాలపై దృష్టి పెట్టండి అని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer