దేవునిలో మాత్రమే మనం జీవితపు వెలుగును కనుగొంటాము

దేవునిలో మాత్రమే మనం జీవితపు వెలుగును కనుగొంటాము

ఆదివారం నాడు, పునీత పేతురు మహా దేవాలయ ఆవరణలో మహా పూజ్య  పోప్ ఫ్రాన్సిస్ గారు విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ  సందేశంలో పోప్ ఫ్రాన్సిస్ గారు బాప్తిస్మ యోహాను గారి జీవితాన్ని ఆదర్శముగా తీసుకున్నారు.  
 
బాప్తిస్మ యోహాను గారు  క్రీస్తు అనే వెలుగు కు సాక్షంగా  జీవించారో వివరిస్తూ దేవుని పనిలో తను  నమ్మిన నీతి, అతని నిజాయితీ ప్రవర్తన ద్వారా  ప్రజలు  మరింత మెరుగ్గా  క్రీస్తు మార్గంలో నడవడానికి ప్రేరేపించిందని పోప్ ఫ్రాన్సిస్ గారు అన్నారు.

యేసు ప్రభువువారు ప్రపంచంలోకి వస్తున్నారని, ఆయనే దేవుని గొర్రెపిల్ల అని, మనలను   "రక్షించే దేవుడు" అని  బాప్తిస్మ యోహాను గారు స్వయంగా జనసమూహానికి ప్రకటిస్తూ, తాను కాంతి లేదా దేవుడు  కాదని చెప్పారని అని పోప్ ఫ్రాన్సిస్ గారు గుర్తుచేసుకున్నారు.

"దేవునిలో మాత్రమే జీవితపు వెలుగును కనుగొంటాము" అని పొప్ ఫ్రాన్సిస్ గారు తెలిపారు. చీకటితో నిండిన ఈ ప్రపంచానికి క్రీస్తు అనే వెలుగును మనమందరము అందరికీ పంచాలని, బాప్తిస్మ యోహాను వలె నీతి , నిజాయితీతో నిజమైన  క్రీస్తు సేవకునిలా జీవిస్తూ దేవుని సంతోష పెట్టాలని ఈ సందర్భముగా పోప్ ఫ్రాన్సిస్ గారు కోరారు.