డే ఆఫ్ సినడాలిటీ
రేడియో వెరితాస్ ఆసియా (RVA) మాండరిన్ విభాగం వారు డిసెంబర్ 8న రేడియో వెరితాస్ ఆసియా సభామందిరం నందు "మేరీ అండ్ సినడాలిటీ: సహవాస పయనం" అనే అంశంపై చర్చించేందుకు సంగోష్టి నిర్వహించారు.
ఈ సెమినార్ ఫిలిప్పీన్స్, మనీలాలో నివసిస్తున్న మతపరమైన చైనీయుల కోసం 'RVA-మండరిన్ డే' జ్ఞాపకార్థంగా నిర్వహించారు.
మాజీ మాండరిన్ విభాగ కోఆర్డినేటర్ గురుశ్రీ జాన్ మి షెన్ పాల్గొనేవారికి సినడాలిటీ ఉద్ధేశాని వివరించారు.
ప్రతి సంవత్సరం ఫిలిప్పీన్స్, మనీలాలో నివసించే చైనీస్ కతోలిక్కులందరి గౌరవార్థం "RVA-మాండరిన్ డే" జరుపుకుంటారు.
ఈ సంవత్సరం తైవాన్ నుండి ప్రదర్శన కోసం ప్రయాణించిన "గాడ్స్ వాలంటీర్, వాకింగ్ ఇన్ ది లైట్" గాయకబృందం వారు కూడా పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేసారు.
మనీలా నుండి చైనీస్ కతోలికులతో పాటు, సొసైటీ ఆఫ్ జీసస్, కాంగ్రెగేషన్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మౌంట్ కార్మెల్, సిస్టర్స్ ఆఫ్ ఛారిటీ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ అండ్ పెర్పెచువల్ హెల్ప్, సిస్టర్స్ ఆఫ్ అవర్ లేడీ కన్సోలేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మేషన్ ఫోండాసియో ఆసియా మరియు ఇతరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.