క్రైస్తవ హక్కుల పరిరక్షణ ఉద్యమం
క్రైస్తవ హక్కుల పరిరక్షణ ఉద్యమం
క్రైస్తవులపై జరుగుచున్న వరుస దాడులపై నిరసన ర్యాలీ
విశాఖ అతిమేత్రాసనం, విశాఖపట్నం లో దేశ వ్యాప్తంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి జగదాంబ వరకు ర్యాలీ ఈ కొనసాగింది. ఈ ర్యాలీలో అధికసంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.
ఈశాన్య అస్సాం రాష్ట్రంలో క్రైస్తవ పాఠశాలల నుండి మతపరమైన చిహ్నాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ బెదిరింపు పోస్టర్లు పాఠశాలలకు అంటించారు.ఈ బెదిరింపులకు సంబంధించి కుటుంబ సురక్ష పరిషత్" ఫిబ్రవరి 7న గౌహతిలో విలేకరుల సమావేశం కూడా నిర్వహించి కాథోలిక పాఠశాలలకు అల్టిమేటం ఇచ్చింది.
తెలంగాణాలో జనవాడ అనే ప్రాంతంలో మెథడిస్ట్ చర్చి పై ఫిబ్రవరి 13 న ఒక గుంపు దేవాలయం పై దాడి చేయడంతో కనీసం 20 మంది క్రైస్తవులు గాయపడ్డారు. వాడనర్సాపురంలో ఒక దేవాలయం కాల్చివేసారు.
ఇంతే కాకుండా క్రైస్తవుల దేవాలయాలపై, క్రైస్తవుల పై భౌతికంగా దాడులు చేయడం వంటి ఘటనలు ఇంకా జరుగుతున్నాయి. క్రైస్తవ మైనారిటీలపై మతోన్మాదులు జరుపుతున్న వరుస దాడులు, హత్యలు, బైబిల్స్ కాల్చివేయడం, దేవాలయలు కాల్చడం, తిలకం దిద్దడం, క్రిస్మస్,బాప్తీస్మములు,ఆధ్యాత్మిక కార్యక్రమాలు, బరియల్స్, సువార్తలును అడ్డుకోవడం వంటి తదితర దాడులు జరపడం ఎక్కువవుతున్నాయి. వాటిని అరికట్టడానికి ప్రత్యేక చట్టాలను రూపొందించి అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నజరేయ మినిస్ట్రీస్ రేవ్ జోసెఫ్ ప్రకాష్, రేవ్ హనీ జాన్సన్, ట్రినిటీ లూథ్రిన్ దేవాలయాల కాపరి రేవ్ Dr. పాల్ రాబర్ట్ స్మిత్ గారు , ఇతర గురువులు , కాథోలిక కాన్వెంట్ సిస్టర్స్ , విశ్వాసులు పాల్గొవున్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer