క్రైస్తవ మతపెద్దల అవగాహన సదస్సు
ఫెడరేషన్ అఫ్ తెలుగు చర్చెస్ (FTC ) , తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ అఫ్ చర్చెస్ (TSFC ), తెలంగాణ కౌన్సిల్ అఫ్ చర్చెస్ (TCC ) మరియు సినడ్ అఫ్ తెలంగాణ (SOT ) ఆధ్వర్యంలో ప్రస్తుత సామాజిక మరియు రాజకీయ పరిస్థితులపై క్రైస్తవుల స్పందన అనే కార్యక్రమం 19 అక్టోబర్ 2023 న నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం CSI మెదక్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి క్రైస్తవ, కథోలిక సంఘాలకు చెందిన పలువురు ప్రముఖులు, పాస్టర్లు, గురువులు మరియు కన్యస్త్రీలు హాజరయ్యారు. ఉదయం 10 : 00 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం, మధ్యాహ్నం 2 : 00 గంటల వరకు జరిగింది.
దేశంలోని పాలక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల క్రైస్తవులు ఎటువంటి ఇబ్బందులకు గురైయ్యారు, రాజకీయ పరిణామాల పట్ల క్రైస్తవుల దృక్పధం ఏ విధంగా ఉండాలి, రానున్న ఎన్నికలలో క్రైస్తవులు పాటించవలసిన ప్రణాలికను ఈ కార్యక్రమంలో చర్చించారు.
గురుశ్రీ కొండవీటి అంతయ్య గారు కార్యక్రమాన్ని నడిపించారు. రెవరెండ్ డేనియల్ గారి స్వాగత పలుకులతో ఈ కార్యక్రమం ప్రారంభమయింది.
మొదటిగా బ్రదర్ వర్గీస్ గారు తన నివేదికను సమర్పించారు. గత 10 సంవత్సరాలలో క్రైస్తవులపై ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరిగాయని, కనుక రానున్న ఎన్నికలలో క్రైస్తవులు పాటించవలసిన ప్రణాలికను ఆయన వివరించారు.
అనంతరం గురుశ్రీ బోస్కో గారు ప్రసంగిస్తూ, కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా మారింది, పాలక ప్రభుత్వాన్ని ఎలా ఓడించగలిగారు, దానికి కర్ణాటక రాష్ట్రంలో అనుసరించిన ప్రణాళిక ఏమిటో ఆయన వివరించారు.
సిస్టర్ లిజి గారు రానున్న ఎన్నికలలో స్త్రీల పాత్రను గూర్చి వివరించారు.
కార్యక్రమం చివరిగా విచ్చేసిన ప్రతినిధులకు గురుశ్రీ కొండవీటి అంతయ్య గారు కృతఙ్ఞతలు తెలిపారు.