కుప్పకూలిన వస్త్ర కర్మాగారం - చేయూతనందించిన కారితాస్ బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ కథోలిక పీఠాధిపతుల సామాజిక అభివృద్ధి విభాగమైన కారితాస్ వారు డిసెంబర్ 15న విద్యార్ధులకు సమావేశాన్ని నిర్వహించారు.
కారితాస్ బంగ్లాదేశ్, ఢాకా ప్రాంతంలో, "రాణా ప్లాజాలో చనిపోయిన కార్మికుల పిల్లలకు దీర్ఘకాలిక విద్యా సహాయాన్ని" అమలు చేస్తోంది.
ఏప్రిల్ 24, 2013న బంగ్లాదేశ్ శివార్లలోని రానా ప్లాజా అనే వస్త్ర కర్మాగారం కూలిపోయింది, దీని వలన 1,100 మందికి పైగా మరణించారు మరియు 2,500 మంది గాయపడ్డారు. వారిలో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు.
ప్రైవేట్ దాత నిధుల సహకారంతో కారితాస్ విద్యా ప్రాజెక్ట్ జనవరి 2014 నుండి కొనసాగుతోంది.
ఈ కార్యక్రమం రానా ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ అమిత్ రోజారియో గారిచే సార్వత్రిక ప్రార్థనతో ప్రారంభమైంది.
జూనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మిస్టర్ మైఖల్ రొజారియో కార్యక్రమాన్ని సులభతరం చేశారు.
కారితాస్ ఢాకా ప్రాంతం యాక్టింగ్ డైరెక్టర్ శ్రీ. షావ్రాబ్ రోజారియో ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా మరియు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ కార్యక్రమం లబ్ధిదారుల విద్య మరియు కుటుంబ పరిస్థితికి సంబంధించిన వివరాలను సేకరించేందుకు నిర్వహించారు.
శ్రీ. షావ్రాబ్ రోజారియో, కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.