ఘనంగా వైజాగ్ సిటీ యూత్ క్రిస్మస్
ఘనంగా వైజాగ్ సిటీ యూత్ క్రిస్మస్
విశాఖ అతిమేత్రాసనం మహారాణి పేటలో గల క్రీస్తు జయంతి స్కూల్ నందు సిటీ యూత్ క్రిస్మస్ ఘనంగా జరిగింది. డిసెంబర్ 15 న జరిగిన ఈ వేడుకలకు వివిధ విచారణల నుండి యువతీ యువకులు పాల్గొన్నారు. విశాఖ అతిమేత్రాసన యువత డైరెక్టర్ గురుశ్రీ ప్రేమ్ కుమార్ మరియు గురుశ్రీ విజయ్ భాస్కర్ గార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆద్యాంతం ఉత్సాహంగా ,ఉల్లాసముగా జరిగింది.
విశాఖ అర్బన్ డీన్ గురుశ్రీ సరిస ప్రతాప్ గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఇతర గురువులతో కలసి దివ్య పూజాబలిని సమర్పించారు. గురుశ్రీ సరిస ప్రతాప్ గారు క్రిస్మస్ సందేశాన్ని యువతకు అందించారు.
వివిధ విచారణ నుండి వచ్చిన యువతీ యువకులు మధ్యాహ్నం జరిగీనటువంటి సాంస్కృతిక కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ అతి మేత్రాసన వికార్ జనరల్, మహారాణిపేట విచారణ ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ డి బాలశౌరి గారు, ప్రొక్యూటర్ గురుశ్రీ కోన జయరాజు గారు, గురుశ్రీ కె వేలంగాని రాజు, గురుశ్రీ రవితేజ గార్లు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచినవారికి గురుశ్రీ డి బాలశౌరి గారి చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ సందర్భముగా జాతీయ ఉత్తమ ఉపాధ్యయ అవార్డు గ్రహీత శ్రీ గొట్టేటి రవి మాస్టర్ గారిని సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి గురుశ్రీ ప్రేమ్ కుమార్ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer