సెయింట్ థెరిస్సా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
సెయింట్ థెరిస్సా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
సెయింట్ థెరిసా హాస్పిటల్ - శంషాబాద్ శాఖ (St.Theresa's Hospital - Shamshabad) వారి ఆధ్వర్యంలో శంషాబాద్ సమీపంలోని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ సమీపంలోని దాదాపు 43 గ్రామాలలో ఈ వైద్య సేవలను అందిస్తున్నట్లు హాస్పిటల్ పాలనాధికారి(Administrator) సిస్టర్ తోమాసమ్మ గారు తెలిపారు.
శంషాబాద్ సమీపంలోని తొండేపల్లె గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి డాక్టర్ రోహిత్ , డాక్టర్ అశ్విని, డాక్టర్ థామస్ గారి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నర్సింగ్ స్టాఫ్ వర్జీనియా(Virginia) మరియు బీమ్లా(Bimla) తమ వంతు సహకారాన్ని అందించారు.
దాదాపు 120 మందికి వైద్య పరీక్షలు మరియు ఉచిత మందులను అందించారు. వైద్య పరీక్షలలో భాగంగా బిపి, షుగరు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు.
సిస్టర్ తోమాసమ్మ గారు మాట్లాడుతూ " ప్రభు యేసు క్రీస్తు వలె ప్రతి ఒక్కరూ పేదవారిని ఆదుకోవాలని, పేదలకు నాణ్యమైన వైద్యం అందేలాగున ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు".
శంషాబాద్ సమీపంలోని గ్రామాల్లో తమ వైద్య సేవలు కొనసాగుతాయని సిస్టర్ తోమాసమ్మ గారు తెలిపారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer