శంషాబాద్ అగ్రపీఠాధిపతులుగా మహా ఘన ప్రిన్స్ అంతోని

శంషాబాద్ అగ్రపీఠాధిపతులుగా మహా ఘన ప్రిన్స్ అంతోని
సిరో-మలబార్ లో కొత్త నియామకాలు జరిగాయి. సిరో-మలబార్ 12 మేత్రాసనాలలో వాటి సరిహద్దులను తిరిగి రూపొందించారు. కళ్యాణ్, శంషాబాద్, ఫరీదాబాద్ మరియు ఉజ్జయిని మేత్రాసనాలను అతి మేత్రాసన(Archdiocese) స్థాయికి పెంచారు.
మహా ఘన ప్రిన్స్ అంతోని గారు సిరో-మలబార్, శంషాబాద్ అగ్రపీఠాధిపతులుగా నియమితులయ్యారు. అలాగే మహా పూజ్య మార్ కురియకోస్ భరణికులంగర గారు ఫరీదాబాద్ కు, మహా పూజ్య సెబాస్టియన్ వడకెల్ గారు ఉజ్జయిని కు , మహా పూజ్య సెబాస్టియన్ వానియాపురక్కల్ గారు కళ్యాణ్ అతిమేత్రాసనాలకు అగ్రపీఠాధిపతులుగా నియమితులయ్యారు. మహా పూజ్య జోసెఫ్ థాచరంబాత్ CMI, ఆదిలాబాద్ మేత్రాసనానికి పీఠాధిపతులుగా నియమితులయ్యారు.
మహా ఘన ప్రిన్స్ అంతోని గారు ప్రస్తుత యుగానికి నిదర్శనం. ఆదిలాబాద్ మేత్రాసనానికి యెనలేని సేవలందించారు. ప్రజలతో కలిసి జీవించే ఒక బిషప్ గా, గొర్రెలను కాపాడే కాపరిలా, ఒక నాయకుడిగా, మరియు సాధారణ వ్యక్తిగా తన ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభు యేసుక్రీస్తు ప్రేమను ప్రజలకు తెలియజేసారు.
తన ప్రజలను ప్రభు యేసుని మార్గంలో నడిపిస్తూ... ఒక నిజమైన ఆధ్యాత్మిక నాయకుడిగా దేవుని ప్రేమను, మార్గదర్శకత్వాన్ని ప్రజలకు అందించారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, ప్రజల మధ్య మామూలు మనిషిలా జీవిస్తూ, వారి కష్టసుఖాలను పంచుకున్నారు. మహా ఘన ప్రిన్స్ అంతోని గారు దేవుని ప్రేమను, కరుణను ప్రజలకు అందిస్తూ, వారి జీవితాలకు మార్గనిర్దేశం చేసేవారు.
"జీవస్వరం సువార్త స్వస్థత కూటములు" పేరుతో ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థన కూటములు ఆదిలాబాద్లో నిర్వహించారు. వేలాదిమంది విశ్వాసులు ఈ ప్రార్థనలో పాల్గొన్ని స్వస్థతలు పొందారు.
సమాజానికి సేవ చేసే కన్యస్త్రీలను అబద్దపు అభియోగాలతో నిర్బంధించడాన్ని ఖండిస్తూ మహా పూజ్య ప్రిన్స్ అంతోని గారు ప్రజలతో కలసి సికింద్రాబాద్ నందు భారీ ర్యాలీ నిర్వహించారు. క్రైస్తువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ తన గళాన్ని వినిపించారు.
ప్రభు యేసు పట్ల ప్రేమ, శ్రద్ధ తో, మీరు ఆదిలాబాద్ మేత్రాసనానికి సువార్తకు అనుగుణంగా మీ జీవితాన్ని అర్పించారు. ఇప్పుడు శంషాబాద్ అగ్రపీఠాధిపతులుగా నియమితులైన సందర్భముగా మహా ఘన ప్రిన్స్ అంతోని గారికి అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు సిబ్బంది తరుపున శుభాకాంక్షలు!
Article and Design by M Kranthi swaroop