సుల్తాన్‌పల్లిలో ఉచిత వైద్య శిబిరం

సుల్తాన్‌పల్లిలో ఉచిత వైద్య శిబిరం

సెయింట్ థెరిసా హాస్పిటల్ - శంషాబాద్ శాఖ (St.Theresa's Hospital - Shamshabad) వారి ఆధ్వర్యంలో శంషాబాద్ సమీపంలోని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం కొనసాగుతోంది. సెయింట్ థెరిసా హాస్పిటల్ పాలనాధికారి(Administrator) సిస్టర్ తోమాసమ్మ గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.

నవంబర్ 30 శనివారం నాడు శంషాబాద్ సమీపంలోని సుల్తాన్‌పల్లి  లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పలువురికి షుగర్, బీపీ ఇతర పరీక్షల నిర్వహించారు.  దాదాపు 100 మందికి పైగా  వైద్య పరీక్షలు చేసి  ఉచిత మందులను అందించారు.  

ఈ సందర్భంగా సిస్టర్ తోమాసమ్మ గారు  మాట్లాడుతూ "నిరుపేదలకు ఉచిత  వైద్య సేవలను అందించడానికి మరియు అవసరంలో ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే"  సెయింట్ థెరిసా హాస్పిటల్ - శంషాబాద్ శాఖ వారి  ఉచిత వైద్య శిబిరం యొక్క లక్ష్యం అని అన్నారు.

సెయింట్ థెరిసా హాస్పిటల్‌లో జనరల్, గైనకాలజీ, ఆప్తాల్మాలజీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, యూరాలజీ, డెంటల్, పేషెంట్ కౌన్సెలింగ్, ప్లాస్టిక్, కాస్మెటిక్ & పునర్నిర్మాణ శస్త్రచికిత్స, బ్లడ్ బ్యాంక్ వంటి అనేక ప్రత్యేకతలు కలిగి ఉందని సిస్టర్ తోమాసమ్మ గారు తెలిపారు.

శంషాబాద్ సమీపంలోని గ్రామాల్లో సెయింట్ థెరిసా హాస్పిటల్ - శంషాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో "ప్రభు యేసు చూపిన ప్రేమే మార్గంగా ఈ ఉచిత  వైద్య సేవలు" కొనసాగుతాయని  సిస్టర్ తోమాసమ్మ గారు తెలిపారు.

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer