సెయింట్ జోసెఫ్స్ పాఠశాలలో "ఇన్వెస్టిట్యూర్ వేడుక - 2025"

సెయింట్ జోసెఫ్స్ పాఠశాలలో "ఇన్వెస్టిట్యూర్  వేడుక - 2025"  

 విజయనగరం, కంటోన్మెంట్ లోని  సెయింట్ జోసెఫ్స్  ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు "ఇన్వెస్టిట్యూర్ వేడుక" జులై19, 2025న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో  స్కూల్ ప్రిన్సిపాల్  సిస్టర్ పుష్ప మేరీ , అడ్మినిస్ట్రేటర్ సిస్టర్ జ్యోత్స్నా గార్ల అద్వర్యం లో జరిగింది. 

ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ మరియు  అధికసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. లీడర్స్ గా ఎన్నుకోబడిన విద్యార్థిని, విద్యార్థులు ప్రతిజ్ఞ చేసి బ్యాడ్జ్ లు , ఫ్లాగ్స్ (Flag) స్వీకరించారు. ఎన్నుకోబడిన స్కూల్ లీడర్స్ ను ప్రిన్సిపాల్  మరియు స్కూల్ టీచర్స్  అభినందించారు.

సిస్టర్ పుష్ప మేరీ  గారు మాట్లాడుతూ "విద్యార్థులు మంచి మార్కులు సాధించడంతో పాటు, చదువును అర్థం చేసుకోవడం, నేర్చుకోవడంపై ఆసక్తి పెంచుకోవడం ముఖ్యం అని ,ఇతరులతో స్నేహంగా ఉండటం, మంచిగా మాట్లాడటం, అందరితో కలసి పనిచేయడం నేర్చుకోవాలి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో  పిల్లలందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 

 

Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer