జీవన్ ప్రింటింగ్ ప్రెస్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

జీవన్ ప్రింటింగ్ ప్రెస్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
జీవన్ ప్రింటింగ్ ప్రెస్ (Jeevan institute of printing) వారి ఆధ్వర్యంలో ఈరోజు అనగా జూన్ 9,2025 న సిఖ్ విల్లేజ్ లోని జీవన్ ప్రింటింగ్ ప్రెస్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రింటింగ్ ప్రెస్ డైరెక్టర్ ఫాదర్ జయరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
వివిధ TCBC విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇతర సిబ్బంది మరియు సిఖ్ విల్లేజ్ చుట్టుపక్కల ఉన్నవారు ఈ సేవలను వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరికి నిపుణులైన వైద్యుల సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
అమోర్ హాస్పిటల్స్(Amor Hospital) సిబ్బంది దాదాపు 100 మందికి వైద్య పరీక్షలు చేసారు. వైద్య పరీక్షలలో భాగంగా బిపి, షుగరు ఇతర వైద్య పరీక్షలు చేయగా, క్లోవ్ డెంటల్ హాస్పటల్ వారు డెంటల్ పరీక్షలు, అమెరికన్ లేసర్ EYE హాస్పిటల్ వారు కంటి పరీక్షలు నిర్వహించారు.
డైరెక్టర్ ఫాదర్ జయరాజు గారు మాట్లాడుతూ " ఆరోగ్యం పట్ల నిర్లక్షం వద్దని, ప్రతిఒక్కరూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు". అమోర్ హాస్పిటల్స్ (Amor Hospital) సహకారంతో ఈ క్యాంపు ఏర్పాటుచేశారని ఫాదర్ జయరాజు గారు తెలిపారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer