శాంతి సాధన పాఠశాలకు స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు

శాంతి సాధన స్కూల్ కు స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు
విశాఖ అతిమేత్రాసనం, ఆర్. వి నగర్ లోని శాంతి సాధన ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు "స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సెలెన్స్ అవార్డు" కు లభించింది .
ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో "జిల్లా విద్యాశాఖ అధికారి" చేతుల మీదుగా ఈ అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ ఫాదర్ గురుశ్రీ హ్యారీ ఫిలిప్స్ గారు పాల్గొని "స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సెలెన్స్ అవార్డు" ను తమ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తో కలసి అందుకున్నారు.
స్కూల్ కరస్పాండెంట్ ఫాదర్ గురుశ్రీ హ్యారీ ఫిలిప్స్ గారు మాట్లాడుతూ "పాఠశాలల్లో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జాతీయ క్రీడా దినోత్సవం రోజున క్రీడల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని కోరారు.
2023-24 విద్యా సంవత్సరానికి గాను స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డుల కోసం ఎంపిక చేసిన 130 పాఠశాలల్లో 1,040 పాయింట్లు సాధించి, పాఠశాల క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ మొదటి స్థానంలో నిలిచింది.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer