మహారాణిపేట విచారణలో ఘనంగా పునీత అంతోనివారి పండుగ  

మహారాణిపేట విచారణలో ఘనంగా పునీత అంతోనివారి పండుగ  
విశాఖ అతి మేత్రాసనం, మహారాణి పేట విచారణ  పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం లో  పునీత అంతోని వారి   పండుగ మహోత్సవం ఘనంగా జరిగింది . విశాఖ అతి మేత్రాసన వికార్ జనరల్, మహారాణిపేట విచారణ ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ డి బాలశౌరి గారి  ఆద్వర్యం లో ఈ వేడుకలు జరిగాయి.

ఉదయం జరిగిన పండుగ మహోత్సవంలో  నల్గొండ పీఠాధిపతులు మహా పూజ్య కరణం ధమాన్కుమార్ MSFS  గారు పాల్గొని ఇతర గురువులతో కలసి పండుగ  దివ్యబలి పూజను సమర్పించారు. ఈ కార్యక్రమం లో విశాఖ అతి మేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారు , గురుశ్రీ వర్గేసే చపరత్,  ప్రొక్యూటర్ గురుశ్రీ కోన జయరాజు గారు , గురుశ్రీ ప్రేమ్ కుమార్, గురుశ్రీ శివ్వం సుధాకర్ , గురుశ్రీ కె వేలంగాని  రాజు , ఇతర గురువులు  పాల్గొన్నారు.

 సాయంత్రం విశ్వాసులు  పునీత అంతోని వారి తేరు తో వివిధ వీధులలో తిరుగుతూ ప్రదక్షిణ చేస్తూ  దేవాలయం చేరుకున్నారు. విచారణ యువత అంతోనీవారి తేరును, దేవాలయాన్ని అందంగా అలంకరించారు.గురుశ్రీ డి బాలశౌరి గారు ఇతరగురువులతో కలసి  దివ్యబలి పూజను సమర్పించారు.అధిక సంఖ్యలో గురువులు,సిస్టర్స్ , విశ్వాసులు ఈ మహోత్సవం లో పాల్గొన్నారు. విచారణ గాయక బృదం మధురమైన గీతాలను ఆలపించారు .

విచారణ  గురువులు గురుశ్రీ డి బాలశౌరి గారు పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.    

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer