పోప్ లియోను స్వాగతించించిన కాస్టెల్ గాండోల్ఫో పట్టణం

పోప్ లియోను స్వాగతించించిన కాస్టెల్ గాండోల్ఫో పట్టణం 

జులై 13 కాస్టెల్ గాండోల్ఫో పట్టణంలో పోప్ మొట్టమొదటి ప్రజా కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో స్వాగతించారు  

Villa Barberini నుండి అపోస్టోలిక్ ప్యాలెస్‌కు అనుసంధానించే ప్రధాన వీధిలో వేలాది మంది ప్రజలు బారులు తీరి ఫ్రీడమ్ స్క్వేర్‌లో గుమిగూడారు.

బారికేడ్ల వెనుక నిలబడి ఉన్న రెండు వరుసల విశ్వాసుల మధ్య వాహనం కదలగలిగేంత వెడల్పు ఉన్న ఇరుకైన వీధులో పోప్ ప్రయాణించారు . 

పోప్ లియో తన చేతులు చాచి అందరినీ పలకరించడానికి ప్రయత్నించారు 

జూలై 3న బహుమతిగా ఇచ్చిన తన కొత్త ఓపెన్ ఎలక్ట్రిక్ వాహనంలో నవ్వుతున్న పోప్ యొక్క ప్రతి అడుగును అనుసరించడానికి జూబ్లీ టోపీలు ధరించిన పర్యాటకులు మరియు యాత్రికులు ఆసక్తిగా  వీధి వెంబడి పరిగెత్తారు.