మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత

మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత

ఆదిలాబాద్ మేత్రాసనం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్కూల్ ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా హనుమాన్ మాల ధరించి కొంతమంది విద్యార్థుల స్కూల్ కి వచ్చారు. ప్రిన్సిపాల్ దీనిని ప్రశ్నించడంతో వివాదం చోటుచేసుకుంది. స్కూల్‌ లోపల హనుమాన్‌ దీక్షలో ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల నిరసన చేపట్టారు.

విషయం తెలుసున్న హనుమాన్‌ భక్తులు పెద్దసంఖ్యలో స్కూల్‌ దగ్గరకు చేరుకొని ... జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేస్తూ స్కూలును ధ్వంసం చేశారు. టీచర్స్ , సిస్టర్స్ లను బయపెడుతూ క్లాస్ రూమ్ అద్దాలను ద్వాంసం చేసారు. సిస్టర్స్ ను బయటకు వెళ్ళిపోండంటూ తిట్టారు.టీచర్లు దండం పెట్టి వేడుకుంటునప్పటికీ, కాషాయ దుస్తులు ధరించిన పురుషులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ క్లాస్ రూమ్ కిటికీ అద్దాలను పగులగొట్టడం జరిగింది.

ప్రిన్సిపాల్ జైమన్ జోసెఫ్ మొఖానికి  కాషాయ రంగులను పూసారు. కొంతమంది వ్యక్తులు ప్రిన్సిపాల్ నుదిటిపై బలవంతంగా తిలకం దిద్దారు. ప్రిన్సిపాల్ జైమన్ జోసెఫ్ ను బలవంతంగా స్కూల్ టెర్రస్ పైకి లాకొని వెళ్లి మేడలో హనుమాన్‌ కండువా వేసి , మైక్ లో జై శ్రీరామ్ అని అనిపించారు. స్కూల్ సిబ్బందిని మరియు విద్యార్థులను బయబ్రంతులకు గురిచేసారు.

స్కూల్ బయట ఉన్న మదర్ తెరెసా, ఇతరుల విగ్రహాన్ని రాళ్లతో కొట్టారు. పోలీసులు స్కూల్ కు చేరుకొని వారిని అదుపులోనికి తీసుకున్నారు.

ప్రిన్సిపాల్ జైమన్ జోసెఫ్ గారు మాట్లాడుతూ " విద్యార్థులు మాల ధరించి రావడం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని, కాకపోతే తల్లిదండ్రులు విద్యార్థుల దీక్ష, యూనిఫామ్ విషయమై ఒకసారి స్కూల్ మేనేజ్మెంట్ కు చెప్పాల్సింది అని అన్నారు.

భారత దేశంలో పేదలకు, రోగులకు నిస్వార్థ సేవ చేసిన మదర్ తెరెసా పేరు మీద ఈ స్కూల్ ను నడిపిస్తున్నారు.

గత కొంతకాలంగా ఈశాన్య అస్సాం రాష్ట్రంలోని శ్రీసభ నిర్వహిస్తున్న పాఠశాలలో అన్ని క్రైస్తవ చిహ్నాలను తొలగించాలి అని ఫిబ్రవరి 18న కుటుంబ సురక్ష పరిషత్ బెదిరింపు ఇంకా మరిచిపోకముందే ఆదిలాబాద్ లో ఈ సంఘటన జరిగింది.

క్రైస్తవ మిషనరీలు అనేక దశాబ్దాలుగా విద్యా, వైద్య సేవ లో ఉంటూ పేదలకు మరియు అవసరంలో ఉన్నవారికి సేవ చేస్తూ తద్వారా దేశానికి సేవ చేస్తున్నాయి. కానీ, దురదృష్టవశాత్తు, అలాంటి సంస్థలు అనవసరంగా మత మార్పిడి వంటి తప్పుడు ఆరోపణలకు నిందిస్తూ ఇటువంటి దాడులు జరుగుతుండడం ఎంతో బాధాకరం.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer