భక్తిశ్రద్ధలతో పాప పశ్చాత్తాప పాదయాత్ర మహోత్సవము

భక్తిశ్రద్ధలతో పాప పశ్చాత్తాప పాదయాత్ర మహోత్సవము
విశాఖ అతిమేత్రాసనం క్రీస్తురాజు పుణ్యక్షేత్రం, క్రీస్తురాజుపురం, యర్రసామంతవలస విచారణ లో పాప పశ్చాత్తాప పాదయాత్ర మహోత్సవము భక్తిశ్రద్ధలతో జరిగింది. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, యర్రసామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి. జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ మహోత్సవం జరిగింది.
మార్చి 12, 2024 మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పాదయాత్ర మార్కొండపుట్టి గ్రామము నుండి మరియు D.K.పట్నం నుండి ఒకేసారి మొదలైయి క్రీస్తురాజు పుణ్యక్షేత్రం వరకు సాగింది. అధికసంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు పాల్గొన్నారు.
పాదయాత్ర అనంతరం ఉదయం 9 గంటలకు జపమాల , శ్రమకాల గానాలను ఆలపించారు. అనంతరం ఉదయం 10 గంటలకు ప్రత్యేక స్లీవ మార్గం క్రీస్తురాజు పుణ్యక్షేత్ర కొండపైకి నిర్వహించారు. గురుశ్రీ బందనాదం జోసెఫ్ గారు ప్రత్యేకంగా పాప సంకీర్తనలు లో ఉండి ప్రజల పాపముల మన్నింపు కొరకు ఆ దేవాది దేవుని ప్రార్ధించారు.
ఈ కార్యక్రమంలో విశాఖ అగ్రపీఠ పరిపాలనాధికారి మహా పూజ్య డా. పొలిమేర జయరావుగారు పాల్గొని, ఉదయం 11 గంటలకు ఇతర గురుపుంగవులతో కలసి సమిష్టి దివ్య పూజాబలిని సమర్పించారు. అనంతరం దివ్య సత్ప్రసాద ఆరాధన, స్వస్థత ప్రార్థనలు నిర్వహించారు.
గురుశ్రీ పి. జీవన్ బాబుగారు వచ్చిన భక్తులందరికీ ప్రేమ విందుని ఏర్పాటు చేసారు .
గురుశ్రీ శౌరి బాబు గారు భక్తుల కొరకు ప్రత్యేక ప్రార్దనలు జరిపారు.
ఈ మహోత్సవం లో బొబ్బిలి విచారణ కర్తలు గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ గారు, గురుశ్రీ మరియారత్నం గారు, గురుశ్రీ బోగీ సంజీవి గారు, గురుశ్రీ శ్రీధర్ గారు, గురుశ్రీ RPV ప్రసాద్ గారు, గురుశ్రీ ఆనంద్ గారు, గురుశ్రీ సైమన్ కింతల గారు, గురుశ్రీ సంతోష్ గారు, గురుశ్రీ నరేష్ గారు ,గురుశ్రీ జయ రాజు గారు, గురుశ్రీ బుంగ బాల రాజు గారు , గురుశ్రీ డేవిడ్ గారు, గురుశ్రీ కిషోర్ గారు, గురుశ్రీ మరియాదాస్ గారు, గురుశ్రీ యోహాన్ గారు మరియు ఇతర గురువులు పాల్గొన్నారు.
ఈ 40 రోజుల తపస్సుకాలంలో మన పాపములకై పశ్చాత్తాప పడి, క్రీస్తును శ్రమలను ధ్యానిస్తూ ప్రభు యేసుని మార్గంలో పయనించాలని గురుశ్రీ పి. జీవన్ బాబుగారు కోరారు.పాప పశ్చాత్తాప పాదయాత్ర మహోత్సవానికి సహకరించిన విచారణ పెద్దలు, మరియదళం సభ్యులు, యువతీ యువకులుకు మరియు సహాయం అందించిన ప్రతి ఒక్కరికి గురుశ్రీ పి. జీవన్ బాబుగారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer