భక్తియుతంగా సిలువగిరి మొదటి శనివారపు ఉపవాస ప్రార్థన

భక్తియుతంగా సిలువగిరి మొదటి శనివారపు ఉపవాస ప్రార్థన

విశాఖ అతిమేత్రాసనం, వెంగాపురం విచారణ, పెదపెంకి గ్రామములో మొదటి శనివారపు ఉపవాస ప్రార్థన కూటమి భక్తియుతంగా జరిగింది. వెంగాపురం విచారణ కర్తలు గురుశ్రీ కిల్లాడ ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

శనివారం ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలనుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. గురుశ్రీ ఆనంద్ గారు విశ్వాసులందరి కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన మరియు దివ్య బలిపూజను నిర్వహించారు.విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.

గురుశ్రీ ఆనంద్ గారు మాట్లాడుతూ "సిలువగిరినాధుని దీవెనలు మన అందరిపై ఉన్నాయి అని, మన హృదయాన్ని ఎల్లప్పుడూ ఆ దేవుని ప్రేమ,కరుణ, మంచి తనాన్ని నింపుకోవాలని కోరారు. ఏ ఒక్కరిని బాధించే స్వభావం , మోసం చేసే స్వభావం, కామము , క్రోధము వంటివి మన హృదయంలో ఉండకూడదు అని, చివరిగా మన హృదయం దేవుని యొక్క ప్రేమతో నిండియుండాలని విచారణ కర్తలు ప్రబోధించారు .

ఉపవాస ప్రార్థనల అనంతరం పి. చాకరపల్లి గ్రామస్థుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది . గురుశ్రీ ఆనంద్ గారు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer