హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపిన పోప్ లియో

పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనాలో ఆగస్టు 6 బుధవారం జరిగిన సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మంత్రులు, ప్రభుత్వ అధికారులు మరియు సిబ్బందికై పోప్ లియో విచారాన్ని వ్యక్తం చేశారు.
ఘనా కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, సుయాని మేత్రాసన పీఠాధిపతి Matthew K. Gyamfi ని ఉద్దేశించి సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్డినల్ పియట్రో పరోలిన్ సంతకం చేసిన టెలిగ్రామ్‌లో సంతాపం ప్రకటించారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నిత్య విశ్రాంతి కలగాలని, ఈ విషాదంలో ప్రభావితమైన వారందరికీ "దైవిక బలం చేకూరాలని పొప్ తన ఆధ్యాత్మిక సాన్నిహిత్యాన్ని తెలియచేసారు.
ముగ్గురు సిబ్బంది మరియు ఐదుగురు ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్, మధ్య Ashanti ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది.
ఘనా రక్షణ మంత్రి Edward Omane Boamah,పర్యావరణ మంత్రి Ibrahim Murtala మొహమ్మెద్,ఆరుగురు సిబ్బంది మరియు వారితో పాటు ఇతర ప్రయాణికులు ఉన్నారు.
అక్రమ మైనింగ్‌ను ఆపడానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి వారు Obuasi పట్టణానికి వెళుతున్నారు. వారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.
వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది
ఘనా అధ్యక్షుడు John Dramani Mahama మూడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించారు.