అర్మేనియా-అజర్‌బైజాన్ శాంతి ఒప్పందాన్ని ప్రశంసించిన పోప్ లియో

ఆగస్టు 10 ఆదివారం త్రికాల ప్రార్థన తర్వాత అంతర్జాతీయ సంఘాలకు మరియు దాని నాయకులను యుద్ధాన్ని తిరస్కరించాలని పోప్ లియో విజ్ఞప్తి చేశారు  

నాయకులు బాధ్యత వహించి,శాంతి కోసం చురుకుగా పనిచేయాలని పిలుపునిస్తూ ఈ లక్ష్యం కోసం విశ్వాసులు ప్రార్థనను ఎప్పటికీ ఆపవద్దని పోప్ కోరారు.

ఆగస్టు 8న అర్మేనియా ప్రధాన మంత్రి Nikol Pashinyan మరియు Azerbaijani అధ్యక్షుడు Ilham Aliyev సంతకం చేసిన ఒప్పందాన్ని నిరీక్షణకు చిహ్నం అని పోప్ లియో అన్నారు 

వారి ఉమ్మడి ప్రకటన, ఒక ముఖ్యమైన ముందడుగుగా దక్షిణ Caucasusలో స్థిరమైన మరియు శాశ్వత శాంతి నెలకొల్పడానికి దోహదపడతాయని ఆయన అన్నారు.

హైతీలో కొనసాగుతున్న సంక్షోభంపై కూడా పోప్ దృష్టి సారించారు,"నిరాశతో మునిగిపోతున్న" జనుల బాధలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

దేశంలో విస్తృతంగా జరుగుతున్న "అన్ని రకాల హింస, మానవ అక్రమ రవాణా, బలవంతపు స్థానభ్రంశం మరియు కిడ్నాప్‌లను" ఆయన ఖండించారు.

"హైతీ ప్రజలకు అంతర్జాతీయ సంస్థల మద్దతు అందించాలని పోప్ పిలుపునిచ్చారు.