బంగ్లాదేశ్‌లోని కతోలిక పాఠశాలపై దాడి

బంగ్లాదేశ్‌లోని కతోలిక పాఠశాలపై దాడి

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కొనసాగుతున్న హింసాకాండలో సెయింట్ గ్రెగోరీస్ స్కూల్ మరియు  కాలేజీ పై దాడి జరిగింది. నవంబరు 24న కతోలిక విద్యాసంస్థపై  ఒక విద్యార్థుల బృందం దాడి చేసింది. దాడి చేయడంతో తరగతులను నిలిపివేయాల్సి వచ్చింది. దాడి చేసిన వారు సెక్యూరిటీ గార్డులను కొట్టి, గేట్లను ధ్వంసం చేసి, పాఠశాల ఆవరణలో అలజడి సృష్టించారు. గంటల తరబడి జరిగిన ఈ దాడిలో భారీ నష్టం వాటిల్లింది. దాదాపు ముప్పై మంది విద్యార్థుల బృందం ఈ దాడి లో పాల్గొన్నారు.  ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గాయపడ్డారు.   

దాడి జరిగిన మరుసటి రోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో, గుంపు హింస గంటల తరబడి కొనసాగిందని మరియు అధిక మొత్తంలో ( $100,000) నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఆ గుంపు నాటు బాంబులను ప్రయోగించి గందరగోళం సృష్టించింది అని అన్నారు .

బంగ్లాదేశ్ క్యాథలిక్ ఎడ్యుకేషన్ బోర్డ్ (BCEB) కార్యదర్శి జ్యోతి F. గోమ్స్, పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయంతో సహా ఢాకాలోని BCEB ఆధ్వర్యంలో నడపబడుతున్న సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

బంగ్లాదేశ్లోని  తిరుగుబాటు ఆగస్టులో ప్రారంభమయినది.  అప్పటి ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పాలనను తొలగించినప్పటి నుండి క్రైస్తవులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాయని గోమ్స్ UCA న్యూస్‌తో చెప్పారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer