ప్రధమ దివ్య సత్ప్రసాద స్వీకరణ మహోత్సవం
![](/sites/default/files/styles/max_width_770px/public/2025-02/feast_0.jpg?itok=s42HZD7m)
ప్రధమ దివ్య సత్ప్రసాద స్వీకరణ మహోత్సవం
మూడు పీఠకాల లేదా మూడు పీఠముల పండుగ
విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, రక్షణగిరి పుణ్యక్షేత్రంలో ప్రధమ దివ్యసత్ప్రసాద స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది బాలబాలికలు, కొందరు పెద్దలు ప్రధమ దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమం విశాఖ అతి మేత్రాసన ఛాన్సలర్ మరియు జ్ఞానాపురం విచారణ కర్తలు గురుశ్రీ జొన్నాడ ప్రకాశ్ గారి ఆధ్వర్యంలో జరిగింది.
ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతర గురువులతో కలసి దివ్య పూజాబలిని సమర్పించారు. ఈ దివ్య పూజలో 100 మంది చిన్నారులు మహా పూజ్య మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారి చేతుల మీదుగా నూతన దివ్యసత్ప్రసాదాన్ని సీకరించారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో సహాయ విచారణ కర్తలు - గురుశ్రీ వినయ్ కుమార్, గురుశ్రీ అంతోని రాజ్ లు తమ సహాయ సహకారాలను అందించారు. దాదాపు 150 మంది గురువులు , సిస్టర్స్ పాల్గొన్నారు. AICU ప్రెసిడెంట్ శ్రీ BVR శేషుబాబు గారు , PPC ప్రెసిడెంట్ రాజేష్ బాబు మరియు సభ్యులు , మరియదళం సభ్యులు,వివిధ భక్త సంఘాలు తమ సహాయ సహకారాలను అందించారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer