యువ యాత్రికులను ఉద్దేశించి ప్రసంగించిన పోప్
మంగళవారం జూలై 29 సాయంత్రం సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో యువతా జూబిలీకి పోప్ లియో ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన యువతను స్వాగతించారు.
సువార్తీకరణ డికాస్టరీ ప్రో-ప్రిఫెక్ట్ మోన్సిగ్నోర్ Rino Fisichella సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో యువతా జూబిలీ ఆరంభ దివ్యబలిపూజను సమర్పించారు.
అనంతరం పోప్ మొబైల్‌లో సెయింట్ పీటర్స్ స్క్వేర్ చుట్టూ కొన్ని పర్యటనలు చేసి హాజరైన యువతను పోప్ లియో పలకరించారు.
భూమికి ఉప్పుగాను, ప్రపంచానికి వెలుగుగా జీవించమని యాత్రికులను ప్రోత్సహిస్తూ నేడు మీ స్వరాలు, మీ ఉత్సాహం, మీ కేకలు - అవన్నీ యేసుక్రీస్తు కోసం - ప్రపంచ నలుమూలలకు వినబడతాయి!” అని పోప్ అన్నారు.
"మీరందరూ ఎల్లప్పుడూ ప్రపంచంలో నిరీక్షణా చిహ్నాలుగా ఉంటారని మేము ఆశిస్తున్నాము," అని పోప్ లియో కొనసాగించారు.
"ఈ రోజు మనం ప్రారంభంలో ఉన్నాము. రాబోయే రోజుల్లో, దేవుని కృపను, నిరీక్షణా సందేశాన్ని, రోమ్ నగరానికి, ఇటలీకి మరియు మొత్తం ప్రపంచానికి వెలుగును తీసుకువచ్చే శక్తిగా ఉండే అవకాశం మీకు లభిస్తుంది.
యేసుక్రీస్తుపై మన విశ్వాసంతో కలిసి నడుద్దాం. మరియు ప్రపంచంలో శాంతి కొరకు కష్టపడదాము
మనమందరం వెతుకుతున్న ఈ ప్రపంచ వెలుగైన యేసుక్రీస్తు శాంతికి, సయోధ్యకు సాక్షులుగా ఉందాం.
