నవంబర్ 7న విడుదల కానున్న సిస్టర్ "రాణి మారియా" సినిమా

నవంబర్ 7న విడుదల కానున్న సిస్టర్ "రాణి మారియా" సినిమా
బ్లెస్డ్ సిస్టర్ రాణి మారియా గారి జీవిత కథతో తెరకెక్కిన 'ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్' సినిమా నవంబర్ 7, 2025న ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో విడుదల కానున్నది. దీనిని మన దివ్యవాణి టీవీ సగర్వంగా మనకు అందిస్తున్నది.
కేరళలో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న విన్సీ అలోషియస్ సిస్టర్ రాణి మారియా పాత్రను పోషించింది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన డాక్టర్ షైసన్ పి ఔసేఫ్ గారు దీనికి దర్శకత్వం వహించారు. డాక్టర్ సాండ్రా డిసౌజా రానా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే 58 కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం 2024లో జరిగిన 96వ అకాడమీ అవార్డులలో ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగాలకు ఆస్కార్ అర్హత జాబితాలో చోటు సంపాదించింది
క్రైస్తవ మతానికి బలిదానం కొత్త కాదు....చాలామంది క్రీస్తు ప్రభువు కొరకు హతసాక్షులయ్యారు. ధైర్యం మరియు క్షమాపణ కలిగిన ఈ శక్తివంతమైన "సిస్టర్ రాణి మారియ" సినిమాను అందరు చూడాలని , ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని ప్రోత్సహించడంలో అందరు సహకరించాలని కోరుతున్నది మన దివ్యవాణి టీవీ ఛానల్.
Article and Design
M Kranthi Swaroop