ట్రాన్స్ జెండర్ల తో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన HASSS
ట్రాన్స్ జెండర్ల తో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన HASSS
హైదరాబాద్ ఆర్చ్‌డియోసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ (HASSS) వారి ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్ల తో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. హస్ డైరెక్టర్ గురుశ్రీ మాదాను అంతోని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
డిసెంబర్ 18, 2024న సూరారంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు, కార్డినల్ మహా పూజ్య కార్డినల్ పూల అంతోని గారు హాజరయ్యారు. ఇది అట్టడుగు వర్గాలకు క్రైస్తవ ప్రేమ సందేశాన్ని పంపిందని పాల్గొన్న పలువురు అన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పీడబ్ల్యూడీ మరియు ట్రాన్స్‌జెండర్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి అరుణ గారు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీమతి ప్రీతి సునంద గారి ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్లతో మరియు స్వయం సహాయ సంఘాలతో కలిసి ఈ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రంలో గురుశ్రీ జోజి రెడ్డి గారు మరియు HASSS సభ్యులు పాల్గొన్నారు.
కార్డినల్ పూల అంతోని గారు అమూల్యమైన క్రిస్మస్ సందేశం ఇచ్చారు. నిజమైన క్రిస్మస్ అంటే పేదలను మరియు నిర్లక్ష్యం చేయబడిన వారిని ఆదరించడం మరియు వారికి అంగీకారం మరియు గౌరవాన్ని అందించడం" అని కార్డినల్ పూల అంతోని గారు అన్నారు.
ఈ సందర్భంగా కార్డినల్ మహా పూజ్య పూల అంతోని గారు ట్రాన్స్‌జెండర్లకు మరియు స్వయం సహాయ సంఘాల వారికి కుట్టు మెషీన్లను పంపిణీ చేశారు.
పీడబ్ల్యూడీ మరియు ట్రాన్స్‌జెండర్ల అసిస్టెంట్ డైరెక్టర్ మేడమ్ అరుణ గారు ట్రాన్స్‌జెండర్ల కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. హాస్స్ చేసిన సేవలను ప్రశంసించారు.
కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరిని గురుశ్రీ మాదాను అంతోని గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer