ఉక్రెయిన్‌ను సందర్శించిన కార్డినల్ మహా పూజ్య పరోలిన్
ఉక్రెయిన్‌ను సందర్శించిన కార్డినల్ మహా పూజ్య పరోలిన్
కార్డినల్ మహా పూజ్య పరోలిన్ గారు ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్‌కీ గారిని కలుసుకున్నారు. శాంతి కోసం తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
కార్డినల్ జూలై 23న కైవ్‌లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ మరియు ఇతర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఉక్రేనియన్ నాయకులతో కార్డినల్ మహా పూజ్య పియట్రో పరోలిన్ గారు నిర్వహించిన ఈ సంస్థాగత సమావేశాలు మంగళవారం ఉదయం కైవ్‌లో "కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్" మరియు "ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ" మధ్య సమావేశంతో ముగిశాయి.
సమావేశం తరువాత, సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్ కార్డినల్ X(ట్విట్టర్) లో ఒక పోస్ట్‌లో, "పోప్ యొక్క సంఘీభావాన్ని మరియు యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు న్యాయమైన మరియు శాశ్వతమైన శాంతిని కనుగొనే నిబద్ధతను" పునరుద్ఘాటించినట్లు ప్రకటించింది.
"ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ పర్యవసానాలు, కొనసాగుతున్న వైమానిక భీభత్సం, దుర్భరమైన ప్రజల పరిస్థితి మరియు ఇటలీలో G7 సందర్భముగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి తో మా సమావేశం యొక్క పరిణామాల గురించి మేము చర్చించాము అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ గారు అన్నారు.
ఉక్రేనియన్ ప్రజలు శాంతియుతంగా జీవించాలనే మా కోరికకు వాటికన్ మద్దతును నేను అభినందిస్తున్నాను అని, ప్రజలు ప్రాణాలను రక్షించడంలో మరియు వాటి అమలుకు మద్దతు ఇవ్వడంలో వాటికన్ చురుకుగా ఉండటం దేశ ప్రజలు మరచిపోలేరు అని, నేను కృతజ్ఞుడను అని, అని వోలోడిమిర్ జెలెన్స్కీ గారు ట్విట్టర్ పోస్ట్ లో తెలిపారు.
కార్డినల్ మహా పూజ్య పరోలిన్ గారు మరియు ప్రెసిడెంట్ జెలెన్స్కీ గారికి ఆర్డర్ ఆఫ్ మెరిట్ (Order of Merit)తో ఉన్న పరిశుద్ధ పాపుగారి పత్రాన్ని వోలోడిమిర్ జెలెన్స్కీ గారికి ప్రదానం చేశారు.
జూలై 19-24 నుండి కార్డినల్ మహా పూజ్య పరోలిన్ గారు సందర్శనలో భాగంగా కైవ్, ఒడెసా, బెర్డిచివ్ మరియు ఎల్వివ్‌లను సందర్శించారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer